Latest

అమెరికాలో AP యువకుడు మృతి
AP: కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్ క్యాంప్‌కు చెందిన సాయికార్తీక్ వర్మ అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీ'లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇటీవలే అక్కడ ఒక మంచి ఉద్యోగంలో చేరాడు. వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా స్కెడైవింగ్ చేయడానికి వెళ్లాడు. స్కెడైవర్లను తీసుకెళ్లే 'పసిఫిక్ ఏరోస్పేస్ P750' రకానికి చెందిన చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపంతో అదుపుతప్పి భూమిపైకి కుప్పకూలింది. విమానం వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి లోపల ఉన్న 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: 'ప్రాంప్టింగ్' నేర్చుకుంటేనే భవిష్యత్తు!
నేటి డిజిటల్ యుగంలో కేవలం సాంప్రదాయ స్కిల్స్ మాత్రమే సరిపోవని, ఏఐ వాడకంపై పట్టు సాధించడమే అత్యంత కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చాట్‌జిపిటి, జెమిని వంటి ప్లాట్‌ఫామ్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించడానికి 'ప్రాంప్టింగ్' సరికొత్త ఆర్ట్‌గా మారుతోంది. భవిష్యత్తులో ఉద్యోగాల్లో రాణించాలన్నా, కెరీర్‌లో దూసుకుపోవాలన్నా ఏఐతో స్మార్ట్‌గా పని చేయించుకునే నైపుణ్యం తప్పనిసరి. ఏఐని ఒక అసిస్టెంట్‌లా వాడుకుంటూ, మన ఆలోచనలకు తగినట్లుగా సరైన ప్రశ్నలు అడగడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

కనెక్టెడ్ టీవీల జోరు.. లైవ్ స్పోర్ట్స్‌కు భారీగా పెరిగిన వ్యూయర్‌షిప్!
ఇండియాలో లైవ్ స్పోర్ట్స్ మార్కెట్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల డిజిటల్ వ్యూయర్‌షిప్ గతంలో కంటే భారీగా పెరిగింది. ముఖ్యంగా సాంప్రదాయ టీవీల కంటే 'కనెక్టెడ్ టీవీ (CTV)' లీనియర్ ప్లాట్‌ఫామ్ వైపు ప్రేక్షకులు వేగంగా మొగ్గు చూపుతున్నారు. FICCI నివేదిక ప్రకారం, గతేడాదితో పోలిస్తే కనెక్టెడ్ టీవీల వాడకం ఏకంగా 33% పెరిగింది. కేవలం స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా, ఇళ్లలోని పెద్ద స్క్రీన్లపై డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా క్రీడలను వీక్షించే వారి సంఖ్య కోట్లకు చేరింది.

ఏఐని వాడి మెటా, గూగుల్‌ను ఓడించిన లాయర్!
సోషల్ మీడియా వ్యసనంపై ఓ యువతి తరఫున అమెరికాకు చెందిన భారత సంతతి ఏఐ లాయర్ డానియల్ విజయం సాధించారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లకు బానిసగా మారి మానసిక ప్రశాంతత కోల్పోయిన సదరు బాధితురాలికి ఏకంగా రూ.56 కోట్లు (6 మిలియన్ డాలర్లు) చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో మెటా 70%, యూట్యూబ్ మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. టెక్ దిగ్గజాలపై ఏఐ లాయర్ సాధించిన చారిత్రాత్మక విజయమిది.

రాబోయే రోజుల్లో ఏసీలు ఉన్నా బతకలేమా?
భారతదేశంలో ఎండలు 45 డిగ్రీలు దాటేస్తున్నాయని, ACల వల్ల భూమి ఇంకా వేడెక్కుతోంది. మన దేశంలో అడవులు 40% నుండి 21% కి పడిపోయాయి, ఇప్పుడు తక్షణం 500 కోట్ల చెట్లు కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక పెద్ద చెట్టు 20 ACల చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి, వాటిని కాపాడండి.

డాక్టర్ చిట్టీ లేకపోతే ఇక కాఫ్‌సిరప్ ఇవ్వరు!
మెడికల్ షాపుల్లో కాఫ్‌సిరప్‌లు అమ్మడంపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ (చిట్టీ) ఉంటేనే కాఫ్‌సిరప్‌లు ఇవ్వాలని ఆర్డర్ వేసింది. ముందైతే డాక్టర్ చిట్టీ లేకపోయినా షాపుల వాళ్లు ఇచ్చేసేవారు, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. దీనిపై పబ్లిక్ నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఈ ఫైనల్ డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇకపై దగ్గు వస్తే సొంతంగా కాఫ్‌సిరప్‌లు కొనడం కుదరదు.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం!
హైదరాబాద్‌లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ దగ్గర మంగళవారం ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ వాహనాలు (EV) దాచే ఒక గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో 60 ఈవీ బైకులు పూర్తిగా కాలిపోయాయి. గత ఎనిమిది నెలలుగా ఈ గోదాం మూసి ఉండటం, ప్రమాదం జరిగిన టైమ్‌లో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైతులకు CM రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్!
తెలంగాణ రైతులకు CM రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పంట వేసినప్పటి నుంచి అమ్మేంత వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ప్లాన్ రెడీ చేశారు. విత్తనాలు, ఎరువులను ఇకపై డైరెక్ట్‌గా 'రైతు వేదికల' ద్వారానే పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్స్ కమిటీని కూడా వేశారు. అలాగే, సన్న వడ్లు పండించే రైతులకు సబ్సిడీపై 7 రకాల విత్తనాలను ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎరువుల కోసం అవసరమైతే మంత్రులు, MPల టీమ్ ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని CM క్లియర్ గా చెప్పారు.

RSS కార్యకర్తకు దేహశుద్ధి: కాక్రోచెస్
రాజస్థాన్‌లో నీట్ (NEET) పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచెస్ శాంతియుతంగా నిరసన చేపట్టారు. ఆ టైమ్‌లో అక్కడకు వచ్చిన రాకేష్ గుర్జర్ అనే BJP, RSS కార్యకర్త. నిరసన చేస్తున్న కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ ని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మిగతా విద్యార్థులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ కార్యకర్తను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన సదరు బీజేపీ కార్యకర్త ప్రస్తుతం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు.

గుడ్లు, పప్పులో కాంగ్రెస్ 2000 కోట్ల స్కామ్: హరీష్‌రావు
TG: గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2000 కోట్ల స్కామ్ చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా అని ప్రశ్నించారు. కోటిమంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలేదు కానీ అనుముల వారి నలుగురు అన్నాతమ్ముళ్లు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని ఫైరయ్యారు.
పిలవగానే దగ్గరికి వచ్చే చేప వీడియో వైరల్!
మాటలు రాని జీవులు కూడా ప్రేమని గుర్తుపడతాయని చెప్పడానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి గత 9 ఏళ్లుగా ఒక చేపను తన ఫ్యామిలీ మెంబర్‌లా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. రోజులో ఎప్పుడు వెళ్లినా. ఆయన ప్రేమగా ‘నారాయణ’ అని పిలవగానే ఆ చేప అస్సలు భయం లేకుండా ఆయన దగ్గరికి వచ్చేస్తుంది. మనుషులకే కాదు జంతువులకి, మూగజీవులకి కూడా లవ్, బాండింగ్ ఉంటాయని ఈ హార్ట్ టచింగ్ వీడియో ప్రూవ్ చేస్తోంది.
ఇలాంటి పిల్లలు ఉండాలి..
ఢిల్లీ మెట్రోలో జరిగిన ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెట్రో స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఒక సీఐఎస్‌ఎఫ్ (CISF) జవాన్‌ని చూసి.. ఒక చిన్న బాబు ఎంతో గర్వంగా సెల్యూట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ జవాన్ కాళ్లకు దండం పెట్టి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూసిన నెటిజన్లు. "బాబుకి పేరెంట్స్ చాలా మంచి పద్ధతులు నేర్పారు" అంటూ తెగ లైకులు, కామెంట్లు కొడుతున్నారు.

విద్యాశాఖ కమిషనరేట్ వద్ద ABVP ఆందోళన.. ఉద్రిక్తత
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలికవసతుల సమస్యలను పరిష్కరించాలని ABVP ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ABVP నేతలు డిమాండ్ చేశారు. విద్యాశాఖ కార్యాలయంలోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

మావోయిస్టులు మాతోనే ఉన్నారు: కవిత
TG: సింగరేణి కార్మికులను ఇబ్బంది పెడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 'బాయిబాట కార్యక్రమం' లో భాగంగా కవిత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని RK-7 భూగర్భగని వద్దకు వెళ్లి కార్మికులతో మాట్లాడారు. కవితను సింగరేణి సిబ్బంది అడ్డుకోగా ఆమె తన అనుచరులతో కలిసి గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. దీంతో సింగరేణి సిబ్బందికి, హెచ్ఎంఎస్ కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మావోయిస్టులు మాతోనే ఉన్నారని, కార్మికులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.

రౌడీషీటర్ మిస్సింగ్ కేసులో సీఐపై వేటు
AP: విజయవాడలో రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలని పోలీసులను ఎంత వేడుకున్నా స్పందించడం లేదని సాయికృష్ణ తల్లి మీడియా ఎదుట విలపించింది. తన ఫోన్ లాక్కొని కొడుకు ఫొటోలు డిలీట్ చేశారని ఆమె ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగర CP రాజశేఖర్ బాబు స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక CI నాగరాజును వీఆర్‌కు పంపించారు. మరోవైపు ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 29న సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

నవీపేట్ మండలంలో దొంగల బీభత్సం
TG: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని కోస్లీలో వ్యవసాయ బోరు బావుల వద్ద కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేశారు. రాత్రి వేళలో దొంగలు కోస్లీ గ్రామ శివారులోని సుమారు 20వ్యవసాయ బోరు బావుల వద్ద ప్యానెల్ బాక్స్‌లను ధ్వంసం చేసి కేబుల్ వైర్లను దొంగిలించారు. కోస్లీ గ్రామంతోపాటు ఫకిరాబాద్ తదితర ప్రాంతాల్లో పేకాట రాయుళ్ల ఆగడాలు అధికమవ్వడంతో చోరీలు జరుగుతునయని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేనలో చేరికల కోఆర్డినేషన్‌కు 14 మందితో కమిటీ
AP: జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ చేరికలను కోఆర్డినేట్ చేస్తుందన్నారు.

కొడుకు జాబ్ పోయిందని ఫ్యామిలీ సూసైడ్!
నెల్లూరు జిల్లా దువ్వూరులో రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు, భార్య రత్నావళి, దత్తపుత్రుడు సాయి సుకీత్ ఒకే ఇంట్లో శవాలై కనిపించారు. తిరుపతిలో జాబ్ చేస్తున్న కొడుక్కి కంపెనీ వాళ్లు శాలరీ ఇవ్వకుండా, పర్ఫార్మెన్స్ బాలేదని సర్టిఫికెట్స్ ఇచ్చి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు.. తాము లేకపోతే అమాయకుడైన కొడుకు బతకలేడని భావించి, అందరూ కలిసి సూసైడ్ చేసుకున్నారు. చనిపోయే ముందు రాసిన లెటర్ లో.. అంత్యక్రియల ఖర్చులకి డబ్బులు పంపిస్తూ, ఆస్తులను బంధువులకి, రెడ్ క్రాస్ సొసైటీకి ఇవ్వాలని కోరారు.

CM విజయ్‌ని కలిసిన హీరో విశాల్!
తమిళనాడు CM విజయ్‌ని హీరో విశాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాలేజ్ రోజుల నుండి విజయ్‌ని తాను 'డార్లింగ్' అని పిలుస్తానని, CM అయినా ఆయన అస్సలు మారలేదని ట్వీట్ చేశారు. అంతేకాదు, CM కోసం బొకేలు, శాలువాలు కొనకుండా, ఆ మనీతో విజయ్ పేరు మీద ముగ్గురు పేద ఆడపిల్లల చదువుకి హెల్ప్ చేసినట్లు విశాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఏనుగుల సంచారం .. రైతులకు తీవ్ర నష్టం
AP: మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. సిబిల్లి పెద్దవలస, కాముడువలస గ్రామాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. రైతులు, స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. జూన్ 13న సాలూరు నుంచి ఒడిశాకు వెళ్లిన ఏనుగులు.. మళ్లీ ఒడిశా నుంచి సాలూరుకు చేరాయి. కాముడువలసలో పామాయిల్ తోటలను, తోటలో ఉంచిన మోటార్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. తాము కోలుకోలేని విధంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి'
TG: వివిధ నేషనల్ ఎగ్జామ్స్, ఉద్యోగ పరీక్షలు ఉన్న తేదీల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు, అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారని, రెండు పరీక్షలు ఒకేరోజు ఎలా రాస్తారని వర్సిటీ అధికారులను స్టూడింట్స్ ప్రశ్నిస్తున్నారు. OU న్యాయశాస్త్ర విభాగానికి చెందిన 3, 4, 5, 6వ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ ఈ నెల 18 నుంచి మొదలు కానున్నాయి. జూన్ 21వ తేదీన UGC నెట్ పరీక్షతో పాటు, సివిల్ జడ్జ్ మెయిన్స్, హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నాయి. ఆయా పరీక్షలు జిల్లా కేంద్రాల్లో ఉండగా.. అక్కడ ఆ పరీక్షలు రాసి, మళ్ళీ హైదరాబాద్‌కు ఎప్పుడు చేరుకొని సెమిస్టర్ పరీక్షలు రాస్తారని పైరయ్యారు.