Latest

ఆ రోజు స్కూళ్లకు హాలిడే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీన స్కూళ్లకు హాలిడే ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొహర్రం సెలవును ఈ నెల 26వ తేదీకి మార్చింది. ముందుగా ప్రకటించిన సాధారణ సెలవుల జాబితాలో జూన్ 25న ప్రభుత్వ హాలిడే ఉంది. అయితే మొహర్రం 26న జరగనుందని వక్స్ బోర్డు సీఈవో కూటమి సర్కార్‌కు సమాచారం ఇచ్చారు. అలర్ట్ అయిన ప్రభుత్వం సెలవును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 26న ఏపీలో స్కూల్స్‌కు హాలిడే ఉండనుంది. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా హాలిడేను 26కి మార్చుతూ జీవో కూడా విడుదల చేశారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించను: మహేశ్‌కుమార్
AICC రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా పరిగణిస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఆమెపై ఉన్న కేసు విషయాన్ని ఎవరో ఒకరు లీక్ చేసి ఉండొచ్చని అన్నారు. దీనిపై విచారణ జరుగుతుందని చెప్పారు. తనను కూడా పిలిచి విచారణ జరిపారని వెల్లడించారు. ఇటీవలి బెంగళూరులో రేవంత్ చేసిన ‘హిట్లర్’ వ్యాఖ్యలపై మహేశ్‌కుమార్ స్పందించారు. హిట్లర్ స్ఫూర్తి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవించను అని స్పష్టం చేశారు. అది రేవంత్ వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టంచేశారు.

బోడుప్పల్‌లో చైన్ స్నాచింగ్
TG: హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీకి చెందిన వృద్ధురాలు నర్ర అరుణ మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. నార్త్ బాలాజీ హిల్స్ కాలనీలోని సాకుబు నిలయం సమీపంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన చైన్ స్నాచర్ ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడు. వృద్ధురాలి మెడకు స్వల్ప గాయమైంది. చోరీకి గురైన బంగారు మంగళసూత్రం సుమారు 4.5 తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

IRC సదస్సు వేళ తెలంగాణకు ఘోర అవమానం
R & Bశాఖ ENC మోహన్ నాయక్.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ACB సోదాల్లో తేలింది. దేశంలో కీలకమైన 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్(IRC) వార్షిక సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. సదస్సుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోపాటు దేశంలోని అన్నిరాష్ట్రాల మంత్రులు హాజరుకానున్నారు. సదస్సును IRC ఛైర్మన్ హోదాలో, ENC, TG RDC ఎండీగా మోహన్ నాయక్ ముందుండి నడిపించాల్సి ఉంది. సొంత రాష్ట్రంలో సదస్సు నిర్వహించి తెలంగాణ సత్తా చాటాల్సింది పోయి, ఆయనే అవినీతి కేసులో జైలుపాలు కావడం రాష్ట్ర్రానికి తీవ్ర తలవంపులు తెచ్చింది.

అప్పుడు గర్వంగా భావించారు, 7 నెలలు గడవకముందే
TG: రోడ్లు, భవనాల శాఖ ENC జే.మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACBకి చిక్కి జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. అయితే గతేడాది నవంబర్‌లో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) కౌన్సిల్ సమావేశంలో మోహన్ నాయక్‌ను దేశంలోనే ప్రతిష్టాత్మకమైన IRC అధ్యక్ష పదవికి ఎంపిక చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా భావించారు. కానీ, సరిగ్గా 7 నెలలు గడవకముందే ఆయన అవినీతి బాగోతం బయట పడడంతో తెలంగాణ ప్రతిష్టను బజారున పడేశాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ ఇమేజ్ ఘోరంగా పడగొట్టిన ఇరాన్
ఇరాన్ అణ్వస్త్రాలు, క్షిపణి ప్రోగ్రామ్స్‌ను ఆపడమే లక్ష్యంగా ఇరాన్ తో యుద్ధం మొదలు పెట్టిన ట్రంప్.. వాటిపై ఏ హామీలు లేకుండానే ఇరాన్ వార్ ముగించాడు. ఇరాన్ పై చేయి సాధించింది. యుద్ధం వల్ల అమెరికాలో చమురు సహా అన్ని ధరలు పెరిగాయ్. ఫలితంగా ట్రంప్ పాపులారిటీ 60% తగ్గింది. ఇరాన్ క్షిపణి నిల్వలు, యురేనియం ప్రయోగాలపైన గతంలో లాగా ఇప్పుడు ట్రంప్ అభ్యంతరం చెప్పట్లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినా, ఆ దేశం హర్మూజ్ జలసంధిపై క్లియర్ కట్ పట్టు నిలుపుకుంది. ఈ డీల్‌తో భారత్‌కు కొనే ముడి చమురు ధర తగ్గి, మార్కెట్లు బలపడతాయి.

మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్‌ఫ్లాప్: KTR
71సార్లు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్ రెడ్డి మోడీని మెప్పించి మెట్రో ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం సీఎం చేతకానితనానికి నిదర్శనమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైరయ్యారు. UP, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు రెండో దశ మెట్రోరైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలని KTR డిమాండ్ చేశారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్‌ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు రేవంత్‌రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసింది
ఎట్టకేలకు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో రెండు దేశాలు దీనిపై సంతకాలు చేయనున్నాయి. ఈ డీల్‌తో రెండు వైపులా మిలిటరీ యాక్షన్స్ ఆగిపోతాయి. కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఓపెన్ అవుతుంది. ఎలాంటి టోల్ లేకుండానే నౌకల ప్రయాణానికి హార్ముజ్ రూట్ క్లియర్ అవుతుంది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లకు, స్టాక్ మార్కెట్లకు ఇది పెద్ద రిలీఫ్. ఈ 60 రోజుల ఒప్పందంలో అణు అంశాలు, ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి. మరి మన పెట్రోల్ ధరలు తగ్గుతాయా?

గంజాయి తరలిస్తుండగా రోడ్ యాక్సిడెంట్
AP: తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన నలుగురు యువకులు ఒడిశా-ఆంధ్రా సరిహద్దులో 25కిలోల గంజాయి కొనుగోలు చేసి కారులో రవాణా చేస్తున్నారు. నున్నకు సమీపంలోకి రాగానే గంజాయి మత్తులో విజయవాడ బైపాస్‌లో ముందు వెళుతున్న కంటైనర్‌ను ఢీకొట్టారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేరారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారు గంజాయి మత్తులో ఉండడంతో పోలీసులు కారును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుల్లో ఒకరు పరారయ్యాడు.

రాష్ట్ర ఆదాయం తెలంగాణకు పోయింది: కొల్లు రవీంద్ర
YCP హయాంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తెలంగాణకు వెళ్లిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎక్సైజ్‌శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై మంత్రి మాట్లాడారు. 2014-19లో AP కంటే తెలంగాణ రూ.4186 కోట్లు అదనంగా మద్యం అమ్మితే, 2019-24 మధ్య ఏకంగా రూ.42762 కోట్లు అదనంగా అమ్మిందని తెలిపారు. YCP నాయకులకు చెందిన నాసిరకం బ్రాండ్లు విక్రయించడం, ధరలు 75శాతం పెంచడంతో అమ్మకాలు పడిపోయాయన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ షాపులు ఏర్పాటుచేసి AP ప్రజలకు మద్యం అమ్మారని తెలిపారు. ఐదేళ్లలో రూ.18,860 కోట్ల ఆదాయం పక్క రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు జరిమానా
TG: నాంపల్లికి చెందిన రాకేష్ వర్మ కుమారుడు హైదరాబాద్‌లోని మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కోర్సులో చేరారు. మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు కింద రూ.80వేలు చెల్లించారు. పదోతరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ సిబ్బంది తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మొదటి సెమిస్టర్ పూర్తయిన తర్వాత విద్యార్థి చదువును ఆపేశాడు. సర్టిఫికెట్లు తిరిగివ్వాలని విద్యార్థి, అతని తండ్రి కాలేజీ చుట్టూ తిరిగారు. అదనంగా రూ.80వేలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం పేర్కొంది. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో రూ.1.10 లక్షలను చెల్లించాలని పేర్కొంది.

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు బ్రాండెడ్ కిట్
TG: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ, BC, SC, ST, మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బ్రాండెడ్ కిట్ అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కిట్‌లో యూనిఫాంతో పాటు స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, బెడ్డింగ్ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా ఇలా ప్రతి వస్తువులోనూ నాణ్యతకు పెద్దపీట వేయాలని CM రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకే కాకుండా, మొదటిసారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే 2 లక్షల మంది విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగు, బెల్టు, టై, నల్లబూట్లు, సాక్సులను ఉచితంగా అందించనున్నారు.
ఉద్యోగాలు భర్తీ చేయాలని OUలో నిరుద్యోగుల ధర్నా
TG: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుంచి 20వేలకు పెంచాలని ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. మెగా డీఎస్సీ ద్వారా 25వేల ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం OUలోని అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మోదీ అలా చేస్తే ప్రభుత్వాన్ని రద్దు చేస్తా: రేవంత్ రెడ్డి
TG: ప్రధాని మోదీ ముందుగా తన పదవికి రాజీనామా చేసి కేంద్రప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. తాను కూడా CM పదవికి రాజీనామా చేయడంతోపాటు శాసనసభను రద్దు చేసేందుకు రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికలకు వెళ్లాలన్న BJP సవాల్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని.. అధికారంలో కొనసాగడానికి బీజేపీ మాదిరిగా ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడటం లేదని కౌంటర్ ఇచ్చారు.

'తల్లి బాధను అర్థం చేసుకోండి'
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా ఇంకా లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయి పదిరోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే చిన్నారి అదృశ్యంపై కొంతమంది పెడుతున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయని జ్ఞానేశ్వరి తల్లి భవాని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని ఆశతో ఉన్నామని, ఆ ధైర్యాన్ని కూడా కోల్పోనివ్వద్దని ఆమె కోరారు. మరోవైపు చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.

రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తొకట్టలో ఉన్న సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వభూమిని పరిరక్షించాలని BRS అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ కోరారు. సర్వే నంబర్ 157/1లో ఉన్న 8ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని తెలిపారు. 2025లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ భూమిలో 6,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారని గుర్తుచేశారు. ప్రతిపాదనలో ఈ స్థలాన్ని ప్రభుత్వభూమిగానే పరిగణించారని తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలను కోరారు.

మీ పళ్లు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!
మనం డైలీ తాగే టీ, కాఫీ, కోలా పానీయాలు పళ్లపై వేర్వేరుగా ఎఫెక్ట్ చూపిస్తాయి. హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం.. పళ్లపై మొండి మరకలు పడటానికి 'బ్లాక్ టీ', 'కాఫీ'లే మెయిన్ రీజన్. వీటివల్ల పళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఇక కోలా డ్రింక్స్ వల్ల మరకలు తక్కువైనా, అందులోని యాసిడ్స్ పళ్ల పైపొరను (ఎనామెల్) దెబ్బతీసి పిప్పిపళ్ల రిస్క్ పెంచుతాయి. వీటిని తాగిన వెంటనే వాటర్‌తో నోరు క్లీన్ చేసుకోవడం బెస్ట్.

ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన చెత్త టిప్పర్
TG: రంగారెడ్డి జిల్లాలోని మందమల్లమ్మ చౌరస్తా చంద్రా గార్డెన్స్ వద్ద సంతోష్ (26) అనే ఆటోడ్రైవర్ ఆటో రిపేర్ వచ్చి ఆగిపోయింది. ఆటోను మెకానిక్ షాపునకు తీసుకెళ్లేందుకు తన ఫ్రెండ్స్ ప్రసాద్, సునీల్(33)లకు ఫోన్ చేశాడు. వారు మరో ఆటోలో అక్కడకు వచ్చారు. ఆటోకు తాడుతో కట్టి తరలించేందుకు సునీల్, ప్రసాద్ సిద్ధమయ్యారు. LBనగర్ వైపు నుంచి వచ్చిన GHMC చెత్త టిప్పర్ రోడ్డు పక్కనున్న ఆటోడ్రైవర్లను ఢీకొట్టింది. సంతోష్ స్పాట్‌లోనే మరణించాడు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు.

కలెక్టరేట్ వద్ద గిరిజనుల ఆందోళన.. ఉద్రిక్తత
AP: అల్లూరి జిల్లా కలెక్టరేట్ వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు బాధిత గ్రామాలకు చెందిన గిరిజనులు నిరసన నిర్వహించారు. గ్రామస్థులకు తెలియకుండానే హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే ఎలా నిర్వహిస్తున్నారని మజ్జివలస ప్రాంత గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు సాధన కమిటీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. హైడ్రో వపర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సర్వే చేయడం లేదని జిల్లా కలెక్టర్ నిషాంతి స్పష్టం చేశారు.

హైదరాబాద్ మెట్రో లోన్ అడ్డుకుంటున్నారు!
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణను కిషన్ రెడ్డి, KTR కలిసి అడ్డుకుంటున్నారని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. జపాన్ సంస్థ ఇచ్చిన ₹13,600 కోట్ల తక్కువ వడ్డీ లోన్‌ను రాష్ట్రానికి రాకుండా కిషన్ రెడ్డి బ్లాక్ చేశారన్నారు. కేంద్రం ఫండ్స్ ఇవ్వకపోతే NOC ఇస్తే. 100% సొంత ఖర్చులతోనే మెట్రో విస్తరణ పూర్తి చేస్తామని సవాల్ చేశారు. KTR వెనకుండి నడిపిస్తుంటే కిషన్ రెడ్డి మెట్రో ప్రాజెక్టును ఆపుతున్నారని CM మండిపడ్డారు.

కట్నం ఇవ్వలేని నువ్వు బతకడమెందుకు..?
TG: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని చెన్నాపురానికి చెందిన నవీన్ (29) ప్రైవేట్ ఉద్యోగి. అతడి సోదరి మమతకు తుర్కయంజాల్‌కు చెందిన బొమ్మరాజు కృష్ణతో వివాహం చేశారు. 5 తులాల బంగారం, అరకిలో వెండి, ఇతర కట్న కానుకలిచ్చి మ్యారేజ్ జరిపించారు. అక్కా బావ, అత్తమామలు అదనపు కట్నం కావాలని నవీన్‌ను, అతని కుటుంబసభ్యులను వేధించారు. 'కట్నం ఇవ్వడం చేతకాని నువ్వు బతికి ప్రయోజనం ఏంటీ? నీవు చనిపోతే ఆస్తిలో వచ్చే వాటాను కట్నంగా తీసుకుంటాం' అని వేధించారు. మనస్తాపానికి గురైన నవీన్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.