Latest

అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్
TG· 15 Jun 2026

అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్

TG: రాష్ట్రంలో మొత్తం 1269 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ స్కూల్‌లో సోమవారం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌లు బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకంతో 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలని పెంచుతున్నామని తెలిపారు.

తిరిగి వేడి చేయకూడని ఆహారాలు!
Politics· 15 Jun 2026

తిరిగి వేడి చేయకూడని ఆహారాలు!

ఆహారాలు వేడిగా వడ్డించినప్పుడు చాలా రుచిగా ఉంటాయి. కానీ ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడిచేసి తినకూడదని ఎక్స్‌పర్ట్స్ చేపుతున్నారు. పుట్టగొడుగులు, వండిన చికెన్‌ను తిరిగి వేడిచేసి తింటే జీర్ణ, గుండె సమస్యలు వస్తాయి. సెలెరీ, బచ్చలికూర కూడా వేడి చేయడం వల్ల క్యాన్సర్ సమస్యలు వస్తాయి. గుడ్డు కూర తిరిగి వేడి చేయడంతో జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వండిన వెంటనే అన్నం తినాలి. తిరిగి మళ్లీ వేడిచేస్తే ఫుడ్ పాయిజన్‌ అవుతుందన్నారు. ఉడికించిన బంగాలదుంపల కూర తింటే కండరాల పక్షవాతం వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

అఖిలేష్ కూతురు పై ట్రోలింగ్: CM యోగి ఫైర్!
Crime· 15 Jun 2026

అఖిలేష్ కూతురు పై ట్రోలింగ్: CM యోగి ఫైర్!

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూతురిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారాన్ని UP CM యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. అఖిలేష్ కూతురిని టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన నిందితులపై వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆడపిల్లలు అందరికీ సమానమేనని. లీడర్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ని పాలిటిక్స్‌లోకి లాగడం కరెక్ట్ కాదని, అఖిలేష్ కూతురు తనకు కూడా కూతురితో సమానమేనని CM యోగి స్పష్టం చేశారు.

తప్పులే మన అసలైన గురువులు!
Motivational· 15 Jun 2026

తప్పులే మన అసలైన గురువులు!

గ్లోబల్ సింగర్ టెయ్‌లర్ స్విఫ్ట్ న్యూయార్క్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న టైమ్‌లో స్టూడెంట్స్‌కి ఒక మెసేజ్ ఇచ్చారు. లైఫ్‌లో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదని, ప్రతి ఒక్కరూ తప్పులు చేయడం కామన్ అని చెప్పారు. మనం చేసే ఆ తప్పులే మనకు లైఫ్‌లో అసలైన గురువులని, వాటి నుంచే కొత్త విషయాలు నేర్చుకుంటామని గుర్తు చేశారు. తప్పులు జరిగినప్పుడు కుంగిపోకుండా, పర్‌ఫెక్షన్ కోసం ప్రాకులాడకుండా. రిలాక్స్‌గా ముందుకు సాగాలని టెయ్‌లర్ స్విఫ్ట్ అడ్వైజ్ ఇచ్చారు.

ఫుడ్ ఫోటో తీస్తే చాలు.. AI అన్ని వివరాలు చెప్పేస్తుంది!
Health· 15 Jun 2026

ఫుడ్ ఫోటో తీస్తే చాలు.. AI అన్ని వివరాలు చెప్పేస్తుంది!

ఇండియాలోని డిఫరెంట్ ఏరియా వంటకాలు, బిర్యానీల రుచులను డిజిటల్‌గా రికార్డ్ చేయడానికి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్లు ఒక క్రేజీ AI ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దీని పేరే 'భారత్ టేస్ట్ అట్లాస్'. కంప్యూటర్ విజన్, AI టెక్నాలజీతో మన ఇండియన్ థాలీ, బిర్యానీలపై వీళ్లు స్టడీ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో వచ్చే మొబైల్ యాప్‌లో ఫుడ్ ఫోటో తీస్తే చాలు. అందులోని పదార్థాలు, కేలరీలు, పోషక విలువలని ఈ AI సిస్టమ్ ఈజీగా లెక్కగట్టి చెప్పేస్తుంది.

స్మార్ట్‌ఫోన్లతోనే 'జెన్ ఆల్ఫా' లోకం!
Technology· 15 Jun 2026

స్మార్ట్‌ఫోన్లతోనే 'జెన్ ఆల్ఫా' లోకం!

ఇప్పటి జనరేషన్ అంటే 'జెన్ ఆల్ఫా' కిడ్స్ ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లకి ఎంతలా అడిక్ట్ అయ్యారో జనవరి 2026 'జీ5 సర్వే'లో తెలిసింది. వీళ్లు రోజుకు యావరేజ్‌గా 3.6 గంటలు ఫోన్లలోనే గడుపుతున్నారు. ఇందులో 72% మంది ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుంటే, 57% మంది సోషల్ మీడియా రీల్స్ చూస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, చదువు పక్కన పెట్టి.. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఎక్కువ టైమ్ వేస్ట్ చేస్తూ కిడ్స్ ఇంటర్నెట్ బానిసలుగా మారుతున్నారని ఈ స్టడీ హెచ్చరించింది.

రాఘవ లారెన్స్: నేను ప్రజలను కుక్కలతో పోల్చలేదు!▶
Viral· 15 Jun 2026

రాఘవ లారెన్స్: నేను ప్రజలను కుక్కలతో పోల్చలేదు!

రిసెంట్ ప్రెస్ మీట్‌పై వస్తున్న రూమర్స్‌కు హీరో రాఘవ లారెన్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. తాను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ కొందరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని, అది అస్సలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. "కొత్త ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని, కుక్కలను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది" అనే ఉద్దేశంతోనే ఆ మాటలన్నానని చెప్పారు. తన అభిమానులు, ప్రజలు తన తల్లితో సమానమని.. దయచేసి ఫుల్ వీడియో చూసి అర్థం చేసుకోవాలని లారెన్స్ రిక్వెస్ట్ చేశారు.

తెలంగాణలో ఈ–కేబినెట్ మీటింగ్స్
TG· 15 Jun 2026

తెలంగాణలో ఈ–కేబినెట్ మీటింగ్స్

TG: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్స్ ఇకపై ఎలక్ట్రానిక్ విధానంలో జరగనున్నాయి. పరిపాలనలో పేపర్‌లెస్ విధానాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అన్ని కార్యాలయాల్లో ముఖ్యంగా సచివాలయం, డైరెక్టరేట్, కమిషనరేట్ కార్యాలయాల్లో పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దీంతో అత్యాధునిక ట్యాబ్‌లు కొనుగోలు చేయడం, వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్లను సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) నుంచి సాఫ్ట్‌వేర్‌ను తీసుకుంటున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Crime· 15 Jun 2026

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

AP: నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. సంగం మండలం దువ్వూరు విలేజ్‌లో రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు(65), ఆయన భార్య రత్నావళి(60), కుమారుడు సాయిసుకృత్(25) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చేతులకు తాళ్లు కట్టేసి ఉండడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్ విద్యార్థుల కోసం AP విద్యాశాఖ కీలక నిర్ణయం
Education· 15 Jun 2026

ఇంటర్ విద్యార్థుల కోసం AP విద్యాశాఖ కీలక నిర్ణయం

AP విద్యాశాఖ ఇంటర్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతో పోటీపడేలా ఉత్తీర్ణత శాతం పెంచేందుకు స్పెషల్ క్లాసులు నిర్వహణ, మెటీరియల్‌‌ను అందిస్తోంది. గతేడాది IIT, JEE, NEET, తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను కాస్త ఆలస్యంగా అందజేయగా, ఈసారి మాత్రం ముందుగానే అందజేశారు. ఈ మెటీరియల్ ఉచితంగానే ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే నిపుణులైన సబ్జెక్టు లెక్చరర్లతో మెటీరియల్‌ను రూపొందించారు.

ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోరీ.. పోలీసులు కాల్పులు
Crime· 15 Jun 2026

ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోరీ.. పోలీసులు కాల్పులు

AP: బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో S-3, S-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. చైన్‌ లాగడంతో రైలు నిలిచిపోయింది. దొంగలు రైలు దిగి పారిపోతుండగా ఎస్కార్ట్‌ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

హైవేపై ప్రయాణికులపైకి దూసుకొచ్చిన చిరుత
Local· 15 Jun 2026

హైవేపై ప్రయాణికులపైకి దూసుకొచ్చిన చిరుత

AP: నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని నేషనల్ హైవేపై చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గండిపాలెం రోడ్డు సర్కిల్, చెంచురామయ్యనగర్ సమీపంలో ప్రయాణికులపైకి ఒక్కసారిగా చిరుత దూసుకురావడంతో రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు చిరుతను చూసి భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఉదయగిరి పరిసర గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచించారు.

తెలంగాణలో అరుదైన ఖనిజ నిక్షేపాలు
TG· 15 Jun 2026

తెలంగాణలో అరుదైన ఖనిజ నిక్షేపాలు

TG: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తండా పరిధిలోని పర్వతాపూర్‌ శివారులో అరుదైన ఖనిజ నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ భూముల్లో వెనేడియం, టైటానియం, అల్యూమినస్‌ లేటరైట్‌ నిక్షేపాలు ఉన్నట్టు సెంట్రల్ జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు గుర్తించారు. ఈ ఖనిఖ నిక్షేపాలు ఎలక్ట్రిక్‌ బ్యాటరీలు, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలతో పాటు ఇంధన నిల్వలకు ఎంతగానో దోహదపడుతాయని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలమేరకు ఈ ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సంబంధిత శాఖాధికారులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించారు.

బాసర త్రిబుల్ ఐటీ.. ఫుడ్‌లో బొద్దింక
Local· 15 Jun 2026

బాసర త్రిబుల్ ఐటీ.. ఫుడ్‌లో బొద్దింక

TG: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ కళాశాలలో విద్యార్థులకు పెట్టిన ఫుడ్‌లో బొద్దింక రావడం తీవ్ర కలకలం రేపింది. E1-E2 మెస్‌లో చపాతీ ఆలూ కూర్మ వడ్డించగా బొద్దింక ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. డెయిలీ నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు ఆకలిగా ఉన్నా పస్తులుంటున్నామని, డైలీ ఇలాంటి ఫుడ్ తినడం తమకు కామన్‌గా మారిందన్నారు. ప్రాథమిక విచారణ చేపట్టి నిజ నిర్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు యునివర్సిటీ అధికారులు తెలిపారు.

సాయం చేద్దామని వెళ్లి గోదావరిలో గల్లంతు
Crime· 15 Jun 2026

సాయం చేద్దామని వెళ్లి గోదావరిలో గల్లంతు

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట విలేజ్‌కు చెందిన కనితిరెడ్డి రాంబాబు, హేమంత్‌కుమార్ స్నేహితులు. హేమంత్‌కుమార్‌కు చెందిన గేదెలు రుద్రమ్మకోట సమీపంలో గోదావరి నది అవతలి ఒడ్డుపై ఉన్నాయి. వాటిని తోలుకు వచ్చేందుకు హేమంత్, ఆయనకు సాయం చేసేందుకు రాంబాబు కలిసి లోతు తక్కువ ఉండే వైపు నడిచివెళ్లారు. తిరిగి గేదెలను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో రాంబాబు లోతు ఎక్కువగా ఉండే వైపు వెళ్లి గల్లంతయ్యాడు. గల్లంతైన రాంబాబు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయినా మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

రోగనిరోధక శక్తిని పెంచే సహజ అమృతం తేనె
Health· 15 Jun 2026

రోగనిరోధక శక్తిని పెంచే సహజ అమృతం తేనె

తేనే అంటే కేవలం తీపి పదార్థం మాత్రమే కాదు అది ప్రకృతి మనకు ఇచ్చిన ఔషధ నిధి. వేల సంవత్సరాలుగా తేనె మన ఆహారంలో, ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తేనెను తేనెటీగలు పువ్వుల నుంచి సేకరించిన మకరందంతో తయారు చేస్తాయి. సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగిన తేనె గాయాలు మాన్పడంలో, గొంతునొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ మార్నింగ్ గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
Crime· 15 Jun 2026

నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

AP: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోనూరు గ్రామం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతిచెందారు. కుంకలగుంట గ్రామం నుంచి 10 మంది కలిసి కోనూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి గ్రామానికి వెళ్తుండగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడడంతో వారంతా నీటమునిగారు. వీరిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు. మిగిలిన నలుగురు గల్లంతయ్యారు. ముగ్గురు చిన్నారులు గంధం సంధ్య (9), బత్తుల కార్తీక్‌ (12), గంధం సైనీ (10)తోపాటు కొనత చైతన్య(28) చనిపోయారు.

కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: KTR
Politics· 15 Jun 2026

కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: KTR

TG: కొడంగల్‌లో CM రేవంత్ రెడ్డిని ప్రజలు ఓడిస్తారని మాజీ మంత్రి KTR అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా BRS నేతలతో కేటీఆర్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్ బిడ్డను అని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి తరిమికొడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. దాదాపుగా పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా CM చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు.

పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం
Crime· 15 Jun 2026

పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం

TG: హైదరాబాద్‌‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో అధిక లాభాలు వస్తాయని ఇన్వెస్ట్‌మెంట్ యాడ్ చూశాడు. యాడ్‌పై క్లిక్ చేయడంతో సైబర్‌నేరగాళ్లు అతడిని సంప్రదించారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. మోసగాళ్లు సూచించిన బ్యాంక్ అకౌంట్లకు మొత్తం రూ.2.22 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశాడు. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ డ్యాష్‌బోర్డ్‌లో అతని అకౌంట్‌లో రూ.3.1 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగి పయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

RTC బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు
TG· 14 Jun 2026

RTC బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు

TG: రాష్ట్రంలోని అన్నీ RTC బస్సుల్లో ఇకపై ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పెట్టనున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వాహనంలోనూ ప్రథమ చికిత్స కిట్లు ఉండాలనే రూల్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ప్రయాణికులకు అందుబాటులో లేవు. ఈ లోపాన్ని గుర్తించిన ఆర్టీసీ MD వై.నాగిరెడ్డి బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ప్రతి బస్సులోనూ కచ్చితంగా పనిచేసే ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాల్సిందేనని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎండీ ఆదేశాలతో అలర్ట్ అయిన TGS RTC అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,130 బస్సుల్లో ఈ కిట్లను ఏర్పాటు చేయనున్నారు.

ట్రైబల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
TG· 14 Jun 2026

ట్రైబల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

TG: ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ(SSCTU)లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొఫెసర్ జి.రాంరెడ్డి తెలిపారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హైదరాబాద్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో కొత్త అకడమిక్ ప్రోగ్రామ్స్ ప్రారంభించనున్నారు. జూన్ 21 లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.ssctu.ac.inను సందర్శించవచ్చని రాంరెడ్డి తెలిపారు.