Latest

త్రిబుల్ ఐటీ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థినులు
AP: త్రిబుల్ ఐటీ ఫలితాలలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. ముగ్గురు రాజీవ్ గాంధీ ట్రిపుల్ ITలలో సీట్లు సాధించారు. పాఠశాలకు చెందిన బీగాల నాగ జ్యోత్స్న నూజివీడు క్యాంపస్‌లో, పొట్టేళ్ల రేవతి ఇడుపులపాయ క్యాంపస్‌లో, పాకల అనూష ఒంగోలు క్యాంపస్‌లో సీట్లు సాధించారు. పాఠశాల HM కే.మహాలక్ష్మి విద్యార్థినులను అభినందించారు. త్రిబుల్ ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థినులు అక్కడ ఇంటర్మీడియట్‌తో పాటు బీటెక్ కూడా పూర్తి చేసుకుని బయటకు వస్తారని ఆమె చెప్పారు.

నో వెహికిల్ చెకింగ్.. ఓన్లీ స్లీపింగ్
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర్ చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న గార్డు పట్టపగలే నిద్రపోతున్న విషయం బయటపడింది. చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన FBO అక్కడ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి డ్యూటీ టైమ్‌లో నిద్రపోతూ కన్పించాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండగా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చెట్లకొమ్మల విషయంలో కొట్టుకున్న అధికారులు
TG: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్‌లో విరిగి పడిన చెట్లకొమ్మల విషయంలో అటవీశాఖ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇది ఫారెస్ట్ ఏరియా అని అటవీశాఖ అధికారులు వాదించగా, కరెంట్ వైర్లు ఎలా వేయాలంటూ విద్యుత్‌శాఖ అధికారుల మధ్య వివాదం మొదలైంది. మాట మాట పెరిగి అధికారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. చెట్లకొమ్మల తొలగింపు విషయంలో రెండు డిపార్ట్‌మెంట్ల మధ్య మొదలైన గొడవ రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇసుక ట్రాక్టర్ బోల్తా.. 25 ట్రాక్టర్లను దిగ్భందించి నిరసన
AP: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామ పరిధిలోని పంటపొలాల వద్ద ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. అక్రమ ఇసుక రవాణా కారణంగా తమ వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని రైతులు నిరసనకు దిగారు. రైతులంతా ఏకమై 25 ఇసుక ట్రాక్టర్లను పూడి ZP హైస్కూల్ ఆవరణలో దిగ్భందించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నో వెహికిల్ చెకింగ్.. ఓన్లీ స్లీపింగ్
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర్ చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న గార్డు పట్టపగలే నిద్రపోతున్న విషయం బయటపడింది. చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన FBO అక్కడ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి డ్యూటీ టైమ్‌లో నిద్రపోతూ కన్పించాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండగా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫ్లైట్ బాత్‌రూమ్ లో బంగారం!
దుబాయ్ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్‌లో కస్టమ్స్ అధికారులు ఒక లేడి స్మగ్లింగ్ ప్లాన్‌ను బయటపెట్టారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయంతో ఫ్లైట్ ఫ్రంట్ బాత్‌రూమ్‌లోని స్పీకర్ బాక్స్‌ను విప్పి చెక్ చేయగా. అందులో బ్లాక్ టేప్‌తో దాచిన 24 బంగారు బిస్కెట్లు దొరికాయి. దాదాపు 2.8 కేజీల బరువున్న ఈ బంగారం వాల్యూ ₹4.26 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ వింత స్మగ్లింగ్ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కూటమి లీడర్స్ నా ఆస్తులు లూటీ చేస్తున్నారు: KA పాల్
ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ KA పాల్ ఏపీ కూటమి లీడర్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రపంచ శాంతి కోసం ఫైట్ చేస్తుంటే. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మినిస్టర్ లోకేష్ మాత్రం తన చారిటీ ఆస్తులను లూటీ చేసే ప్లాన్‌లో ఉన్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తుల కోసమే వాళ్లంతా చూస్తున్నారంటూ KA పాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో CM హై అలర్ట్!
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. పోలీస్, మున్సిపల్, హైడ్రా, కరెంట్, వాటర్ బోర్డ్ లాంటి అన్ని శాఖలు కలిసి పనిచేయాలన్నారు. సిటీ జనాలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, రెయిన్ ఫోర్‌కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా రెస్క్యూ టీమ్స్‌ను రెడీగా ఉంచాలని CM స్పష్టం చేశారు.

కాకినాడ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!
కాకినాడలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఒక విచారకరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న ఆ అమ్మాయితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క, మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి వింతగా అరుస్తూ ఏడ్చింది. దీంతో నిన్న ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ కట్టి, పాపను వెతికేందుకు పోలీసులు వదిలిపెట్టారు. కానీ, అంతలోనే ఆ పెంపుడు కుక్క చనిపోవడంతో ఈ మిస్సింగ్ కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

బస్సులో మంటలు.. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే దగ్ధం
AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీకి చెందిన ఉద్యోగులు విధులు ముగించుకుని సూళ్లూరుపేట వెళ్తుండగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. IMOP కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు తిరుపతి జిల్లా తడ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అలెర్ట్ అయిన ఉద్యోగులు, డ్రైవర్ బస్సులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ జరగడమే కారణమని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్
TG: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. గాజులరామారం HL కాలనీలోని ఓ అద్దె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీసా, పాస్‌పోర్ట్ లాంటి ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా వారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు నిర్ధారించారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు. పశ్చిమబెంగాల్‌లో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. మరొకరు మృతి
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సూరిబాబు అనే కాంట్రాక్ట్ కార్మికుడు శనివారం చనిపోయాడు. జూన్ 8వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కుద్రవం లీకై ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ద్రవఉక్కు ల్యాడిల్ పేలటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, శనివారం సూరిబాబు అనే ఉద్యోగి చనిపోవటంతో మృతుల సంఖ్య పదికి చేరింది. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

అస్సాంలో రన్ వే పై విమానం కుప్పకూలి ఐదుగురు మృతి
అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఈ ఉదయం ఒక తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. IAF కు చెందిన AN-32 రవాణా విమానం (Transport Aircraft) ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురై, నిప్పుల ముద్దగా మారింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కో-పైలట్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు.

డిప్రెషన్ తో మహిళా టెకీ సూసైడ్ః ఆరు నెలల బేబీ సేఫ్
నిద్రలేమి, ఎంగ్జైటీ, డెలివరీ తర్వాత డిప్రెషన్ లాంటి సమస్యలతో ఓ మహిళా టెకీ హైదరాబాద్ లోని మియాపూర్ లో తన ఆరు నెలల బేబీతో ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్రమైన కుంగుబాటే ఆమె సూసైడ్ కి కారణమని తెలుస్తోంది. ఆరు నెలల పసిపాప మాత్రం తల్లి దూకినప్పుడు నేరుగా కింద పడకుండా పక్కన ఉన్న ప్రొటెక్టివ్ కంచె పై పడటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు ఆమె మెడికల్ రికార్డులను స్టడీ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరు నెలల పసిపాప వాణి మాత్రం సేఫ్ గా, ఆరొగ్యంగానే ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఖాన్ సార్ కాంట్రవర్సీ: కోచింగ్ కింగ్‌కు కొత్త సవాల్!
పాట్నాలో తక్కువ ఫీజుతో, తనదైన teaching styleతో లక్షలాది మంది స్టూడెంట్స్ మనసులు గెలుచుకున్న ఫేమస్ ట్యూటర్ ఫైసల్ ఖాన్ ఇ ప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఒక ప్రత్యర్థి కోచింగ్ సెంటర్‌తో జరిగిన ఘర్షణ ఆయనను వివాదాల్లోకి నెట్టింది. యూపీ, బిహార్‌లలో తిరుగులేని క్రేజ్ ఉన్న ఖాన్ సార్.. ఆర్మీ ఆస్పిరెంట్ స్థాయి నుండి ఎదిగి, ఇప్పుడు పాట్నా కేంద్రంగా NEET & JEE కోచింగ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ తాజా వివాదం ఆయన కోచింగ్ సామ్రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!

ఉత్తరాఖండ్ లో ట్రెక్కర్ మిస్సింగ్ ! పోలీసులు అలెర్ట్ !
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా దయారా బుగ్యాల్ ట్రెకింగ్‌కు వెళ్లి, మే 29న గోయి బేస్ క్యాంప్ నుండి అదృశ్యమైన 23 ఏళ్ల ట్రెక్కర్ బబితా పాండే కోసం గత 10 రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగు తున్నాయి. ఆమె జాడ కనిపెట్టేందుకు పోలీస్, NDRF, SDRF సహా 120 మందికి పైగా సిబ్బంది, ప్రత్యేక డ్రోన్ బృందాలు దట్టమైన అడవులు, లోయల్లో వెతకడం మొదలుపెట్టారు. మరోవైపు, ఆమెతో పాటు వచ్చిన ఇద్దరు ట్రెక్కర్స్ ను పోలీసులు విచారిస్తున్నారు. ట్రెకింగ్ కోసం ఉపయో గించిన పర్మిట్ నకిలీది (ఫోర్జరీ) అని తేలడంతో ఈ కేసును పోలీసులు మరింత సీరియస్ గా తీసుకున్నారు.

నొస్టాల్జియా హిట్: అప్పటి ఇంటర్నెట్ గుర్తుందా?
ఇప్పటి AI, అల్గారిథమ్స్ కాలం కంటే మునుపటి simpler internet రోజులను నెటిజన్లు తెగ గుర్తుచేసుకుంటున్నారు. 90s, 2000s నాటి ఇంటర్నెట్ అనుభూతిని అందించే 16 ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో పాత నోకియా 3310 స్క్రీన్ థీమ్‌తో ఉండే Nokia 3310 site, రెట్రో లుక్ ఇచ్చే RetroCast Now, మరియు వికీపీడియా కంటే పాతదైన Board Game Geek వంటి సైట్లు ఉన్నాయి. ఎలాంటి యాడ్స్, ప్రమోషన్స్ లేని ఆ కాలపు క్లీన్ ఇంటర్నెట్‌ను మిస్ అవుతున్నా మని యూత్ తెగ ఫీలవుతున్నారు!
విన్యాసాలు చేస్తూ 'రియల్ లైఫ్ స్పైడర్‌మ్యాన్' మృతి!
ఎలాంటి సేఫ్టీ లేకుండా పెద్ద కొండలు ఎక్కుతూ ఇంటర్నెట్‌లో 'యెమెన్ స్పైడర్‌మ్యాన్'గా ఫేమస్ అయిన అల్-ఖాఖా విన్యాసాలు చేస్తూ చనిపోయాడు. దామత్ అగ్నిపర్వత కొండలపై స్టంట్స్ చేస్తుండగా జారి కింద ఉన్న లోతైన, వేడి నీటి గుండంలో పడిపోయాడు. అక్కడ నీళ్లు చాలా హాట్‌గా ఉండటం, రెస్క్యూ టీమ్స్ దగ్గర సరైన ఎక్విప్‌మెంట్ లేకపోవడంతో ఆయన డెడ్‌బాడీ ఇంకా దొరకలేదు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండియన్ మాన్సూన్ ని కళ్లకు కట్టే ది ఫ్రాగ్రన్స్ ఆఫ్ రైన్ !
సీజన్ మారడం అంటే కేవలం ఒక వెదర్ లో మార్పు కాదు, అదొక బ్యూటిఫుల్ ఎమోషన్! చల్లగాలి, మబ్బుల చాటున దాగుడుమూతలు ఆడే సూర్యుడు,పచ్చని ప్రకృతి, ఎండ వేడికి నెగళ్లు బారిన భూమినుంచి వచ్చే తొలకరి జల్లుల మట్టి వాసనలు ఇవన్నీ ఇండియన్ వెదర్ కు మాత్రమే స్పెషల్.. ఈ సీజన్‌లో వేడి వేడి చాయ్ తాగుతూ, వాన నీటి జల్లులను ఆస్వా దించడం రియల్లీ గ్రేట్ ఫీలింగ్. రచయిత Stephen Alter తన 'The Fragrance of Rain' బుక్ లో ఇండియన్ రైనీ సీజన్ ని బాగా వర్ణించారు. మీరు కూడా చదివి ఎంజాయ్ చేయండి .

కెరీర్ ఆశ చూపి మూడేళ్లుగా అత్యాచారం!
మహారాష్ట్రలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. అభిజిత్ మెండల్ అనే 36 ఏళ్ల ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్, తన అకాడమీలో చేరిన 17 ఏళ్ల మైనర్ క్రీడాకారిణిపై కెరీర్‌లో పెద్ద అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె అభ్యంతరకర వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ మానసిక వేధింపులు తట్టుకోలేక బాధితురాలు ఫ్యామిలీకి చెప్పడంతో, పోలీసులు కోచ్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.
SPపై బండి సంజయ్ ఆగ్రహం!
సిరిసిల్ల టౌన్‌లోని కుసుమ రామయ్య గవర్నమెంట్ స్కూల్‌లో జరిగిన ఒక ప్రోగ్రామ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్‌కు సిరిసిల్ల జిల్లా SP మహేష్ గీతే అటెండ్ కాలేదు. దీనిపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను వస్తుంటే SP ఎందుకు రాలేదు. ఆయన్ను కూడా ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్ అనుకున్నాను" అంటూ లైవ్‌లోనే SP పై మండిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతోంది.