Latest

తెలుగులో సూపర్, డూపర్ హిట్ సాంగ్స్ భారతీ రాజావే
ఇళయరాజాతో ఆయన కాంబినేషన్ ఒక గోల్డెన్ ఎరా. వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్‌ను కూడా తన 'కిజక్కు చీమయిలే' (తెలుగులో 'పలనాటి పౌరుషం') సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేలా ప్రోత్సహించారు. సీతాకోక చిలుక మూవీలో మిన్నేటి సూరీడు పాట, ఆరాధన మూవీలో అరె ఏమైందీ సాంగ్, ఎర్రగులాబీలులో ఎదలో లయలు, పెదవుల శ్రుతులు లాంటి సాంగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. భారతీ రాజా మూవీస్ లో ఈ సాంగ్స్ వినడానికే కాదు, పల్లెటూరి పచ్చదనం కళ్లముందు కదలాడుతుంది.

జెన్ జీ లొ నయా ట్రెండ్... ఏకాంత ప్రదేశాలలోనే రిలాక్సేషన్ !
ప్రస్తుత డిజిటల్ యుగంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న జెన్ జీ యువత సరికొత్త మార్గాల వైపు మొగ్గు చూపుతోంది. రద్దీగా ఉండే నగరాలు, సోషల్ మీడియాకు దూరంగా... మాల్స్, ఆఫీసుల్లోని ఖాళీగా ఉండే ప్రదేశాలలోవారు మానసిక ప్రశాంతతను, ఉపశమనాన్ని పొందుతున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ కొత్త లైఫ్‌స్టైల్ ట్రెండ్ యువతలో ఒంటరితనాన్ని దూరం చేస్తూ, కొత్త ఊరటనిస్తోంది.

నామినేషన్ రిజెక్ట్.. ECI ఆఫీస్‌కి మీనాక్షి నటరాజన్!
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ రిజెక్ట్ అవ్వడంతో కాంగ్రెస్ కాండిడేట్ మీనాక్షి నటరాజన్ అలర్ట్ అయ్యారు. నామినేషన్ క్యాన్సిల్ అయిన మరుసటి రోజే ఆమె ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ (ECI) ఆఫీస్‌కి వెళ్లారు. అసలు నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందో క్లారిటీ తెచ్చుకోవడానికి ఈసీఐ అధికారులను కలవనున్నారు. ప్రజెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ఇష్యూ ఫుల్ హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు ఇండస్ట్రీకి క్లాసిక్స్ నిచ్చిన గ్రేట్ డైరక్టర్ !
తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన తన చిత్రాలను తెలుగులో కూడా రీమేక్ చేసి ఇక్కడి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మేటి డైరక్టర్ భారతీ రాజా. ముఖ్యంగా కమల్ , శ్రీదేవి నటించిన "ఎర్ర గులాబీలు" (తమిళంలో సిగప్పు రోజాక్కళ్), కే జె యేసుదాస్ అద్భుతమైన పాటలతో వచ్చిన "కొత్త జీవితాలు", అలాగే "సీతాకోకచిలుక" వంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. పరిశ్రమకు ఎందరో నటీనటులను, టెక్నీషియన్లను పరిచయం చేసిన క్రెడిట్ ఆయనదే. ప్రముఖ యాక్ట్రెస్ రాధిక, రాధ, రేవతి, విజయశాంతి, కాజల్ కిరణ్ వంటి ఎందరో స్టార్ హీరోయిన్లు ఆయన సినిమాల ద్వారానే పరిచయం అయ్యారు.

Today CM రేవంత్ రెడ్డి షెడ్యూల్!
తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించనున్నారు. సాయంత్రం 5:30PM కు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఆఫీస్ బిల్డింగ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత CM రేవంత్ రెడ్డి అక్కడ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

మూవీ ఇండస్ట్రీ అల్లా ఉద్దీన్ భారతీ రాజా !
మూవీ ఇండస్ట్రీకి అల్లావుద్దీన్ లాంటి వాడు భాగ్యరాజా . తమిళ సినిమాను స్టూడియో గోడలు బద్దలు కొట్టి సరికొత్త తీరాలకు చేర్చారు. 1977 లో ఇండస్ట్రీలోకి వచ్చి 16 వయదనిలే సినిమాతో రూరల్ బ్యాక్ గ్రౌండ్ సహజ అందాలను, ఆ పచ్చదనాన్ని సిల్వర్ స్క్రీన్ కి ఎక్కించారు. సినిమా క్రేజ్ ఆయన్ను చెన్నైకి చేర్చితే ఆయన సినిమాను పల్లెలకు తీసుకెళ్లారు. ఇదే విషయం ఆయన పబ్లిగ్గా చెప్పేవారు. హీరో ఓరియంటెడ్ స్టోరీస్ ను బ్రేక్ చేసి సాధారణ ప్రజల జీవితాలను తెరకెక్కించి వాళ్లని హీరోలను చేశారు. భారతీ రాజా సినిమాలు డైరక్టరే హీరో అనిపిస్తాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి చేరుకున్న YS జగన్..
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రీసెంట్ గా జరిగిన ఘోర ప్రమాద బాధితులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ చేరుకున్నారు.

'అటు వైపు ఎవరూ వెళ్లొద్దు'
AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దేవీపట్నం మండలం నేలకోట సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. అధునాతన థర్మల్ డ్రోన్లతో పులి కదలికలను రాత్రి పగలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ రెస్క్యూ టీమ్‌లు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు. అవసరమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకునేందుకు అన్ని టీమ్‌లు రెడీగా ఉన్నాయి. కొండ వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు.
క్యాన్సర్ పిల్లల మధ్య బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్!
నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఆయన తన పుట్టినరోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను విజిట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్న పిల్లల మధ్య బాలయ్య కేక్ కట్ చేసి, వాళ్లతో కాసేపు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ చెప్తున్నారు.

బీహార్ లో కుప్ప కూలిన కొత్త రైలు, రోడ్ బ్రిడ్జ్
బీహార్‌లోని బక్సర్ వద్ద ఇటార్హీ రైల్వే క్రాసింగ్ సమీపంలో, ధన్‌సోయ్ లేదా బరుణా వైపు లింక్ చేసే కొత్త రైలు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ చేశారో లేదో అలా కుంగిపోయింది. ఒక స్తంభం సమీపంలో స్లాబ్ కుంగిపోవడంతో పెద్ద గ్యాప్ ఏర్పడగా, కొన్ని చోట్ల కాంక్రీట్ కూడా ఊడిపడింది. ట్రాఫిక్ ప్రారంభించిన కేవలం 3–4 రోజులకే ఈ వంతెనలో తీవ్రమైన నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఈ వంతెన ను మొన్న మే నెల 31 నుంచి ఓపెన్ చేయగా లోపాలు జూన్ 4–6 మధ్య బయటపడ్డాయి. సుమారు ₹26.4 కోట్ల వ్యయంతో కట్టిన బ్రిడ్జి దుస్థితి ఇది..

పిల్లల ఫ్యూచర్ మారాలంటే.. ఈ సీక్రెట్స్ ఫాలో అవ్వండి!
పిల్లల పెంపకంపై కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వాళ్ల ఫ్యూచర్ ని మారుస్తాయి. ముఖ్యంగా గుడ్ ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, మాట్లాడే ముందు ఆలోచించడం, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే సోషల్ మీడియా లో పర్సనల్ విషయాలు అందరితో షేర్ చేయకూడదు, కోపం లాంటి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చిన్నప్పుడే పేరెంట్స్ నేర్పించాలి. ఈ వాల్యూస్ పిల్లల పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కి బాగా యూజ్ అవుతాయని exeperts చెపుతున్నారు.
భారతీరాజా మృతదేహానికి విజయ్ నివాళులు!
తమిళ సినిమా డైరెక్టర్ భారతీరాజా మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. CM విజయ్ స్వయంగా వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం భారతీరాజా ఫ్యామిలీ మెంబర్స్‌ని పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు.

కొండగట్టు అంజన్న సన్నిధిలో NTR తల్లి షాలిని
TG: జూనియర్ NTR తల్లి షాలిని నందమూరి, అత్తమ్మ నార్నే మల్లీశ్వరి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. హనుమాన్ దీక్షలో భాగంగా నార్నే మల్లీశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

పోలీసుల అత్యుత్సాహం.. కాలుపై వాహనం ఎక్కించి...
TG: బీఆర్‌ఎస్ నేత అరెస్ట్ వ్యవహారంలో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంథని సబ్ డివిజన్‌లోని అడవి శ్రీరాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో బీఆర్‌ఎస్ నేత, కమాన్‌పూర్ ఏఎంసీ మాజీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణను బలవంతంగా అదుపులోకి తీసుకొని, అడ్డు వచ్చిన అతని తల్లి కాలుపై నుంచి పోలీస్ వాహనం తీసుకెళ్లారు. పోలీసు వాహనం ఆమె కాలు పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదైతే నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి అడగాలి కానీ కాలుపై వాహనం ఎక్కించడం ఏంటని పలువురు ప్రశ్నించారు.

స్కూల్ పిల్లల హెల్త్ డేంజర్‌లో!
కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుండడంతో బడి పిల్లలపై మళ్లీ బ్యాగుల భారం పెరుగుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్, ఐఐటీ మెటీరియల్స్ అంటూ 1వ తరగతి పిల్లలకి కూడా ఏకంగా 26 బుక్స్ ఇస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే పిల్లలు నడుము, మెడ నొప్పులతో సతమతమవుతున్నారు. నెలకు ఒకసారి 'నో బ్యాగ్ డే' పెట్టాలనే రూల్ ఉన్నా 80 శాతం స్కూళ్లు పట్టించుకోవడం లేదు. పిల్లల నడక తీరు కూడా మారిపోతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్స్.. మిడిల్ క్లాస్ కి పండగే!
హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల గోల్డ్ పై ₹4,300 తగ్గడంతో 10 గ్రాముల ధర ₹1,48,860 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ పై ₹3,950, 18 క్యారెట్లపై ₹3,230 వరకు రేట్స్ పడిపోయాయి. ఇటు వెండి కూడా కేజీకి ఏకంగా ₹10,000 తగ్గడంతో ఇప్పుడు కేజీ సిల్వర్ ధర ₹2,60,000 కి వచ్చింది. బంగారం కొనాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ టైమ్.

మల్కాజిగిరిలో కాల్పుల కలకలం
TG: మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరిలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మారుతినగర్‌లో నిషారాణి, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. వీరి మధ్య గత కొంతకాలంగా తీవ్ర మనస్పర్థలు, విభేదాలు నడుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని నిషారాణికి అరుణ్ చెప్పాడు. ఆమెను నమ్మించి, తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. అరుణ్ తన వద్ద దాచుకున్న తుపాకీతో నిషారాణిపై కాల్పులు జరిపాడు. నిషారాణి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.

వరల్డ్ ఛాంపియన్ అవ్వకపోవడమే బెటర్: గుకేశ్
రీసెంట్ గా నార్వే చెస్ టోర్నీలో సరిగ్గా పర్ఫార్మ్ చేయని ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. 18 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్ కల నెరవేరినా, ఆ తర్వాత వచ్చే మెంటల్ ప్రెజర్, పబ్లిక్ ఎక్స్‌పెక్టేషన్స్ భరించడం కష్టంగా ఉందన్నాడు. అసలు టైటిల్ గెలవని వాళ్లే లక్కీ అని, ఎందుకంటే వాళ్లకి ఒక గోల్ ఉంటుందని చెప్పాడు. ఈ ప్రెజర్ నుండి బయటపడటానికి ఒక స్పెషల్ కోచ్ హెల్ప్ తీసుకుంటున్నట్లు తెలిపాడు.

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
TG: హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన నిషా భానుకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పైలట్ ఉపేందర్ వెంటనే గర్భిణిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో పురిటినొప్పులు తీవ్రం కావడంతో డాక్టర్ల సూచనలతో అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో నిషా భాను మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

గుట్టుచప్పుడుగా 10వేల బోర్లు.. అయినా చర్యల్లేవు
AP: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని బంజరగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట, మిట్టగూడెం, గణపవరం, గుంపెనపల్లి, బోనగిరి, పలు గ్రామాల్లో అక్రమంగా బోర్లు తవ్వుతున్నారు. జామాయిల్, జామ క్లోన్ నర్సరీల వ్యాపారం కోసం కొందరు ఫారెస్ట్, గవర్నమెంట్ ల్యాండ్‌ను ఆక్రమించుకుంటున్నారు. ఒక్కో నర్సరీలో రెండు నుంచి మూడు బోర్లను అనుమతులు లేకుండానే తవ్వుతున్నారు. సుమారు 10వేలకు పైగా అక్రమ బోర్లు వెలిశాయి. అక్రమంగా బోర్లు తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీనాక్షి నామినేషన్ రిజెక్ట్.. అసలు కారణం ఇదే
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ఓ మహిళను వేధించడం, చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆ కేసులో పార్టీ పరంగా మీనాక్షీ నటరాజన్ చర్యలు తీసుకోలేదు. తర్వాత శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. కానీ తర్వాత ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించినట్లు పిటిషన్‌లో సదరు మహిళ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం మీనాక్షికి సమన్లు జారీ చేయడంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.