పోలీసుల అత్యుత్సాహం.. కాలుపై వాహనం ఎక్కించి...

TG: బీఆర్‌ఎస్ నేత అరెస్ట్ వ్యవహారంలో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంథని సబ్ డివిజన్‌లోని అడవి శ్రీరాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో బీఆర్‌ఎస్ నేత, కమాన్‌పూర్ ఏఎంసీ మాజీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణను బలవంతంగా అదుపులోకి తీసుకొని, అడ్డు వచ్చిన అతని తల్లి కాలుపై నుంచి పోలీస్ వాహనం తీసుకెళ్లారు. పోలీసు వాహనం ఆమె కాలు పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదైతే నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి అడగాలి కానీ కాలుపై వాహనం ఎక్కించడం ఏంటని పలువురు ప్రశ్నించారు.


