Latest

మూవీ ఇండస్ట్రీ అల్లా ఉద్దీన్  భారతీ రాజా !
Cinema· 10 Jun 2026

మూవీ ఇండస్ట్రీ అల్లా ఉద్దీన్ భారతీ రాజా !

మూవీ ఇండస్ట్రీకి అల్లావుద్దీన్ లాంటి వాడు భాగ్యరాజా . తమిళ సినిమాను స్టూడియో గోడలు బద్దలు కొట్టి సరికొత్త తీరాలకు చేర్చారు. 1977 లో ఇండస్ట్రీలోకి వచ్చి 16 వయదనిలే సినిమాతో రూరల్ బ్యాక్ గ్రౌండ్ సహజ అందాలను, ఆ పచ్చదనాన్ని సిల్వర్ స్క్రీన్ కి ఎక్కించారు. సినిమా క్రేజ్ ఆయన్ను చెన్నైకి చేర్చితే ఆయన సినిమాను పల్లెలకు తీసుకెళ్లారు. ఇదే విషయం ఆయన పబ్లిగ్గా చెప్పేవారు. హీరో ఓరియంటెడ్ స్టోరీస్ ను బ్రేక్ చేసి సాధారణ ప్రజల జీవితాలను తెరకెక్కించి వాళ్లని హీరోలను చేశారు. భారతీ రాజా సినిమాలు డైరక్టరే హీరో అనిపిస్తాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ దగ్గరికి చేరుకున్న YS జగన్..▶
AP· 10 Jun 2026

విశాఖ స్టీల్ ప్లాంట్‌ దగ్గరికి చేరుకున్న YS జగన్..

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రీసెంట్ గా జరిగిన ఘోర ప్రమాద బాధితులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ చేరుకున్నారు.

'అటు వైపు ఎవరూ వెళ్లొద్దు'
Local· 10 Jun 2026

'అటు వైపు ఎవరూ వెళ్లొద్దు'

AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దేవీపట్నం మండలం నేలకోట సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. అధునాతన థర్మల్ డ్రోన్లతో పులి కదలికలను రాత్రి పగలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ రెస్క్యూ టీమ్‌లు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు. అవసరమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకునేందుకు అన్ని టీమ్‌లు రెడీగా ఉన్నాయి. కొండ వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు.

క్యాన్సర్ పిల్లల మధ్య బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్!▶
News· 10 Jun 2026

క్యాన్సర్ పిల్లల మధ్య బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్!

నందమూరి బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యాయి. ఆయన తన పుట్టినరోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను విజిట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న చిన్న పిల్లల మధ్య బాలయ్య కేక్ కట్ చేసి, వాళ్లతో కాసేపు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ చెప్తున్నారు.

బీహార్ లో కుప్ప కూలిన కొత్త రైలు, రోడ్ బ్రిడ్జ్
India· 10 Jun 2026

బీహార్ లో కుప్ప కూలిన కొత్త రైలు, రోడ్ బ్రిడ్జ్

బీహార్‌లోని బక్సర్ వద్ద ఇటార్హీ రైల్వే క్రాసింగ్ సమీపంలో, ధన్‌సోయ్ లేదా బరుణా వైపు లింక్ చేసే కొత్త రైలు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌ ఇలా ఓపెన్ చేశారో లేదో అలా కుంగిపోయింది. ఒక స్తంభం సమీపంలో స్లాబ్ కుంగిపోవడంతో పెద్ద గ్యాప్ ఏర్పడగా, కొన్ని చోట్ల కాంక్రీట్ కూడా ఊడిపడింది. ట్రాఫిక్‌ ప్రారంభించిన కేవలం 3–4 రోజులకే ఈ వంతెనలో తీవ్రమైన నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఈ వంతెన ను మొన్న మే నెల 31 నుంచి ఓపెన్ చేయగా లోపాలు జూన్ 4–6 మధ్య బయటపడ్డాయి. సుమారు ₹26.4 కోట్ల వ్యయంతో కట్టిన బ్రిడ్జి దుస్థితి ఇది..

పిల్లల ఫ్యూచర్ మారాలంటే.. ఈ సీక్రెట్స్ ఫాలో అవ్వండి!
Motivational· 10 Jun 2026

పిల్లల ఫ్యూచర్ మారాలంటే.. ఈ సీక్రెట్స్ ఫాలో అవ్వండి!

పిల్లల పెంపకంపై కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వాళ్ల ఫ్యూచర్ ని మారుస్తాయి. ముఖ్యంగా గుడ్ ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, మాట్లాడే ముందు ఆలోచించడం, హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే సోషల్ మీడియా లో పర్సనల్ విషయాలు అందరితో షేర్ చేయకూడదు, కోపం లాంటి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చిన్నప్పుడే పేరెంట్స్ నేర్పించాలి. ఈ వాల్యూస్ పిల్లల పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కి బాగా యూజ్ అవుతాయని exeperts చెపుతున్నారు.

భారతీరాజా మృతదేహానికి విజయ్ నివాళులు!▶
News· 10 Jun 2026

భారతీరాజా మృతదేహానికి విజయ్ నివాళులు!

తమిళ సినిమా డైరెక్టర్ భారతీరాజా మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. CM విజయ్ స్వయంగా వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం భారతీరాజా ఫ్యామిలీ మెంబర్స్‌ని పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు.

కొండగట్టు అంజన్న సన్నిధిలో NTR తల్లి షాలిని
Cinema· 10 Jun 2026

కొండగట్టు అంజన్న సన్నిధిలో NTR తల్లి షాలిని

TG: జూనియర్ NTR తల్లి షాలిని నందమూరి, అత్తమ్మ నార్నే మల్లీశ్వరి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. హనుమాన్ దీక్షలో భాగంగా నార్నే మల్లీశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

పోలీసుల అత్యుత్సాహం.. కాలుపై వాహనం ఎక్కించి...
Politics· 10 Jun 2026

పోలీసుల అత్యుత్సాహం.. కాలుపై వాహనం ఎక్కించి...

TG: బీఆర్‌ఎస్‌ నేత అరెస్ట్‌ వ్యవహారంలో పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంథని సబ్‌ డివిజన్‌లోని అడవి శ్రీరాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో బీఆర్‌ఎస్‌ నేత, కమాన్‌పూర్‌ ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ పూదరి సత్యనారాయణను బలవంతంగా అదుపులోకి తీసుకొని, అడ్డు వచ్చిన అతని తల్లి కాలుపై నుంచి పోలీస్‌ వాహనం తీసుకెళ్లారు. పోలీసు వాహనం ఆమె కాలు పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదైతే నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి అడగాలి కానీ కాలుపై వాహనం ఎక్కించడం ఏంటని పలువురు ప్రశ్నించారు.

స్కూల్ పిల్లల హెల్త్ డేంజర్‌లో!
News· 10 Jun 2026

స్కూల్ పిల్లల హెల్త్ డేంజర్‌లో!

కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుండడంతో బడి పిల్లలపై మళ్లీ బ్యాగుల భారం పెరుగుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్, ఐఐటీ మెటీరియల్స్ అంటూ 1వ తరగతి పిల్లలకి కూడా ఏకంగా 26 బుక్స్ ఇస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే పిల్లలు నడుము, మెడ నొప్పులతో సతమతమవుతున్నారు. నెలకు ఒకసారి 'నో బ్యాగ్ డే' పెట్టాలనే రూల్ ఉన్నా 80 శాతం స్కూళ్లు పట్టించుకోవడం లేదు. పిల్లల నడక తీరు కూడా మారిపోతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్స్.. మిడిల్ క్లాస్ కి పండగే!
News· 10 Jun 2026

భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్స్.. మిడిల్ క్లాస్ కి పండగే!

హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల గోల్డ్ పై ₹4,300 తగ్గడంతో 10 గ్రాముల ధర ₹1,48,860 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ పై ₹3,950, 18 క్యారెట్లపై ₹3,230 వరకు రేట్స్ పడిపోయాయి. ఇటు వెండి కూడా కేజీకి ఏకంగా ₹10,000 తగ్గడంతో ఇప్పుడు కేజీ సిల్వర్ ధర ₹2,60,000 కి వచ్చింది. బంగారం కొనాలనుకునే వాళ్లకు ఇది బెస్ట్ టైమ్.

మల్కాజిగిరిలో కాల్పుల కలకలం
Crime· 10 Jun 2026

మల్కాజిగిరిలో కాల్పుల కలకలం

TG: మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరిలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మారుతినగర్‌లో నిషారాణి, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. వీరి మధ్య గత కొంతకాలంగా తీవ్ర మనస్పర్థలు, విభేదాలు నడుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని నిషారాణికి అరుణ్ చెప్పాడు. ఆమెను నమ్మించి, తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. అరుణ్ తన వద్ద దాచుకున్న తుపాకీతో నిషారాణిపై కాల్పులు జరిపాడు. నిషారాణి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది.

వరల్డ్ ఛాంపియన్ అవ్వకపోవడమే బెటర్: గుకేశ్
Sports· 10 Jun 2026

వరల్డ్ ఛాంపియన్ అవ్వకపోవడమే బెటర్: గుకేశ్

రీసెంట్ గా నార్వే చెస్ టోర్నీలో సరిగ్గా పర్ఫార్మ్ చేయని ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. 18 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్ కల నెరవేరినా, ఆ తర్వాత వచ్చే మెంటల్ ప్రెజర్, పబ్లిక్ ఎక్స్‌పెక్టేషన్స్ భరించడం కష్టంగా ఉందన్నాడు. అసలు టైటిల్ గెలవని వాళ్లే లక్కీ అని, ఎందుకంటే వాళ్లకి ఒక గోల్ ఉంటుందని చెప్పాడు. ఈ ప్రెజర్ నుండి బయటపడటానికి ఒక స్పెషల్ కోచ్ హెల్ప్ తీసుకుంటున్నట్లు తెలిపాడు.

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
Local· 10 Jun 2026

అంబులెన్స్‌లోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

TG: హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన నిషా భానుకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పైలట్ ఉపేందర్ వెంటనే గర్భిణిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో పురిటినొప్పులు తీవ్రం కావడంతో డాక్టర్ల సూచనలతో అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో నిషా భాను మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

గుట్టుచప్పుడుగా 10వేల బోర్లు.. అయినా చర్యల్లేవు
Local· 10 Jun 2026

గుట్టుచప్పుడుగా 10వేల బోర్లు.. అయినా చర్యల్లేవు

AP: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని బంజరగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట, మిట్టగూడెం, గణపవరం, గుంపెనపల్లి, బోనగిరి, పలు గ్రామాల్లో అక్రమంగా బోర్లు తవ్వుతున్నారు. జామాయిల్, జామ క్లోన్ నర్సరీల వ్యాపారం కోసం కొందరు ఫారెస్ట్, గవర్నమెంట్ ల్యాండ్‌ను ఆక్రమించుకుంటున్నారు. ఒక్కో నర్సరీలో రెండు నుంచి మూడు బోర్లను అనుమతులు లేకుండానే తవ్వుతున్నారు. సుమారు 10వేలకు పైగా అక్రమ బోర్లు వెలిశాయి. అక్రమంగా బోర్లు తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీనాక్షి నామినేషన్ రిజెక్ట్..  అసలు కారణం ఇదే
Politics· 10 Jun 2026

మీనాక్షి నామినేషన్ రిజెక్ట్.. అసలు కారణం ఇదే

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ఓ మహిళను వేధించడం, చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నాయకుడు శివకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆ కేసులో పార్టీ పరంగా మీనాక్షీ నటరాజన్ చర్యలు తీసుకోలేదు. తర్వాత శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారు. కానీ తర్వాత ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించినట్లు పిటిషన్‌లో సదరు మహిళ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం మీనాక్షికి సమన్లు జారీ చేయడంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.

పార్లమెంట్‌కు పోనివ్వకుండా బీజేపీ చేసిన కుట్ర: నారాయణ
Politics· 10 Jun 2026

పార్లమెంట్‌కు పోనివ్వకుండా బీజేపీ చేసిన కుట్ర: నారాయణ

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేయగా అధికారులు తిరస్కరించారు. దీనిపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. క్రిమినల్ కేసులు నమోదైన వారు నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది కానీ ఎలాంటి కేసులు లేని మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరికాదన్నారు. ఆమెను పార్లమెంట్‌కు పోనివ్వకుండా బీజేపీ చేసిన కుట్ర అని ఫైరయ్యారు.

HYDలో కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన వాహనాలు
Local· 10 Jun 2026

HYDలో కుండపోత వర్షం.. కొట్టుకుపోయిన వాహనాలు

హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. వరద ప్రవాహానికి కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్, హైటెక్స్‌లోని బుట్టా కన్వెన్షన్ హాల్, రాయదుర్గం మెట్రోస్టేషన్ కింద, బయోడైవర్సిటీ కూడలి, మల్కంచెరువు వద్దనున్న ఖాజాగూడ ప్రధాన రహదారి, గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో, కొత్తగూడ చౌరస్తాలో నడుములోతున వరదనీరు వచ్చి చేరింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు కార్లు నీటిలో చిక్కుకుని పడవల్లా తేలాయి.

తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత
Cinema· 10 Jun 2026

తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

ప్రముఖ తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు భారతీరాజా. తెలుగులో ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’, ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’, ‘కొత్త జీవితాలు’, ‘యువతరం పిలిచింది’ ఇలా ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించారు.

వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు మృతి
Crime· 10 Jun 2026

వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు మృతి

TG: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు యువకులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. పాతబస్తీలో ఆటో దిగిన యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా కరెంట్ వైర్లు తగలడంతో షాక్ కొట్టింది. వెంటనే స్థానికులు హాస్పిటల్‌కు తరలించేలోపే వారిద్దరూ చనిపోయారు. భారీ వర్షం వల్ల సిటీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరెంటు తీగలు తెగి పడిపోయాయి. వర్షంతోపాటు ఈదురుగాలులు కూడా వీయడంతో చాలా చోట్ల వైర్లు తెగి నేలపై పడ్డాయి. దీంతో అక్కడక్కడ కరెంట్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై సహాయ చర్యలు చేపట్టారు.

మీ ఫిట్ నెస్ ట్రాకర్ సామర్ధ్మం ఎంత?
Health· 10 Jun 2026

మీ ఫిట్ నెస్ ట్రాకర్ సామర్ధ్మం ఎంత?

మార్కెట్లోని టాప్ హెల్త్ ట్రాకర్లన్నీ మంచి క్వాలిటీవి కాకపోవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ క్లినికల్ ల్యాబ్ టెస్టులు చెబుతున్నాయి. స్టాన్‌ఫోర్డ్ స్లీప్ మెడిసిన్ సెంటర్ ల్యాబ్ ఫలితాలతో పోల్చగా.. నిద్రను కచ్చితంగా అంచనా వేయడంలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 అగ్రస్థానంలో నిలిచింది. తీవ్రమైన శారీరక శ్రమ సమయాల్లో 'వూప్' (Whoop) మెరుగైన రీడింగ్స్ ఇవ్వగా.. ఫిట్‌బిట్, ఔరా రింగ్‌లు కొంతవరకు తప్పుడు ఫలితాలనిచ్చినట్లు ఈ పరిశోధనలో తేలింది.