Latest

జూన్‌లో కొత్తగా 5606 వితంతు పెన్షన్లు
AP: జూన్‌లో కొత్తగా 5606 మందికి స్పౌజ్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేసినట్లు సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ పెన్షన్ల కోసం రూ.2.24 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 1న 62,34,445 మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2728 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్‌తో కలుపుకుని ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో రూ.65,886 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

ఇకపై పదేళ్లలో ఎంబీబీఎస్ పూర్తి
ఎంబీబీఎస్ (MBBS) కోర్సు పూర్తి చేసేందుకు విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించే దిశగా జాతీయ వైద్య కమిషన్ కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సును, తప్పనిసరి రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్‌తో కలిపి 9 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉండగా, ఆ గడువును 10 సంవత్సరాలకు పెంచాలని NMC ప్రతిపాదించింది.

300 శాతం లాభాలంటూ..రూ.85 లక్షలకు టోకరా
AP: కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం జరిగింది. సురే వేణు దంపతులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ‘ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్’ మేనేజర్‌నని నమ్మించి, 3 నెలల్లో 300 శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటలు నమ్మి విడతల వారీగా రూ.85 లక్షలు డిపాజిట్ చేశారు. తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అకౌంట్ బ్లాక్ అయింది. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.

ఊరంతా మొలకలెత్తే అపురూప వేడుక
అన్నమయ్య జిల్లా: వరి ధాన్యపు మొలకల్నే దేవుడికి నైవేధ్యం పెట్టి పూజించే ఒక పండగ గురించి విన్నారా? రాయలసీమలో మొలకల పున్నవి పేరుతో చేసే పంటల పండగ అది. సోమల మండలం కొత్తూరు గ్రామంలో ఈ రోజు ఘనంగా మొలకల పున్నమి వేడుకలు జరుగుతున్నాయి. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామదేవతల్ని పూజించే పచ్చని పండగే ఈ మొలకల పున్నమి. గ్రామస్తులంతా పౌర్ణమికి 9 లేదా 11 రోజుల ముందే కుండీల్లో విత్తనాలు చల్లి మొలకల్ని తయారు చేస్తారు. ఈ రోజు సాయంత్రం ఊరేగింపుగా తెచ్చి గ్రామదేవతకు సమర్పిస్తారు. సామాజిక ఐక్యతను, ప్రకృతి విలువను చాటిచెప్పే అద్భుతమైన పండుగ ఇది.
నేను షర్మిల లా ఫెయిల్డ్ పొలిటీషయన్ ను కాబోను - కవిత
రాజకీయాల్లో తమ టార్గెట్ బీఆర్ ఎస్ పార్టీ కానే కాదన్నారు కవిత. తమ లక్ష్యం కాంగ్రెస్ ను అధికారంలోంచి దింపడమేనన్నారు. కేసీఆర్ లాంటి టాల్ పర్సనాలిటీ తెలంగాణ పాలిటిక్స్ లో ఎవరూ లేరని ఆమె అన్నారు. తమ పార్టీ కచ్చితంగా పవర్ లోకి వస్తుందని తాను ఇంద్రారెడ్డి, దేవేందర్ గౌడ్, చిరంజీవి, షర్మిల లాగా ఫెయిల్డ్ పొలిటీషియన్ ను కాబోనని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలైన కవిత అన్నారు.

ఇవాళ నుంచి ధవళేశ్వరం కాలువలకు నీటి విడుదల
AP: ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాపై తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కాలువల రిపేర్ పనులు జరుగుతున్నందు వల్ల, పరిస్థితిని బట్టి విడదల వారీగా వివిధ కాలువలకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు.
జామ్ ధామ్ గా మారిన చార్ ధామ్ !! పెరిగిన రష్!!
చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు కాయల్సి వస్తోంది..! గమ్యస్థానం ఎప్పుడు చేరతామో.. దైవాన్ని ఎప్పుడూ దర్శించుకుంటామో తెలియని స్థితిలో ఆందోళన చెందుతున్నారు..! కేదార్ నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత రద్దీ నెలకొంది. ఇక బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో జోషీ మఠ్ వద్ద దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తోంది..!

Forbes Listలో భవిత మండవ
హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల మోడల్ భవిత మండవ మరో గుర్తింపు దక్కించుకుంది. Chanel ఇండియన్ హౌస్ అంబాసిడర్‌గా ఉన్న భవిత Forbes 30 Under 30 Asia 2026 జాబితాలో చోటు సంపాదించింది. న్యూయార్క్ మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా దక్కిన ఒక చిన్న మోడలింగ్ ఛాన్స్ భవిత మండవ జీవితాన్ని మార్చేసింది. రీసెంట్ మెట్ గాలాలో బ్లూ జీన్స్‌తో బోల్డ్ ఎంట్రీ ఇచ్చి బ్రౌన్ గర్ల్స్ పవర్ ఏంటో చూపించిన భవిత.. ఇప్పుడు మన Gen Z కి బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్!

బుడాపెస్ట్ సాకర్ టోర్నమెంట్ గెలుపు- పారిస్ లో అల్లర్లు !!
పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG) క్లబ్ శనివారం బుడాపెస్ట్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో ఆర్సెనల్‌పై 4-3 తో పెనాల్టీ షూటౌట్‌లో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. అయితే, ఈ విజయోత్సవం కాస్త పారిస్ వీధుల్లో తీవ్ర హింసకు, విధ్వంసానికి దారితీసింది. ఆనందం కాస్తా అల్లర్లు, హింస, కార్ల దహనంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయానికి ఒకరు ప్రాణాలు కోల్పోగా, 780 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 264 కంటే ఎక్కువ కార్లు కాలి బూడిదయ్యాయి. దాదాపు 20,000 మంది అభిమానులు ప్రసిద్ధ 'చాంప్స్-ఎలిసీస్' వీధిలోకి దూసుకొచ్చారు. రోడ్లపై ఎలక్ట్రిక్ బైకులను తగులబెట్టారు,

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
విశాఖ నగరం గాజువాకలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు చనిపోయారు. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపునకు వెళ్తోంది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇల్లు మన ఐడెంటిటీ.. రూ.లక్ష కోట్లకు చేరిన హోం డెకర్ మార్కెట్!
ఇండియాలో ఇప్పుడు ఇల్లు కొనడమే కాదు, దానికి స్టైలిష్ లుక్ ఇవ్వడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. యూట్యూబ్ హోమ్ టూర్స్, వర్క్ ఫ్రం హోమ్ కల్చర్‌తో ఇల్లు ఒక పర్సనల్ ఐడెంటిటీగా మారింది. దీంతో దేశీయ హోం ఇంటీరియర్ మార్కెట్ విలువ ఏకంగా 12 బిలియన్ డాలర్లకు (రూ.లక్ష కోట్లకు పైగా) చేరింది. కొత్తగా ఇల్లు కొనేవారు మోడ్యులర్ కిచెన్స్, స్మార్ట్ లైటింగ్ కోసమే ప్రాపర్టీ వాల్యూలో 10% నుండి 20% వరకు అదనంగా ఖర్చు చేస్తున్నారు. క్లాసీ లుక్ కోసం చూస్తుండటంతో ఈ మార్కెట్ 13% వృద్ధితో దూసుకుపోతోంది.

అసెంబ్లీల్లో తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం!
ఇటీవలి ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం దేశంలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతోంది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 823 స్థానాలకు గాను కేవలం 107 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ముఖ్యంగా అసోంలో ఈ సంఖ్య 31 నుండి 22కి, పశ్చిమ బెంగాల్‌లో 42 నుండి 40కి పడిపోయింది. అయితే కేరళ (35), తమిళనాడు (9) మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా పాజిటివ్ గ్రోత్ చూపించాయి. జనాభా నిష్పత్తి కంటే ఈ ప్రాతినిధ్యం 1% తక్కువగా ఉండటం గమనార్హం.
తిరుపతిలో దొంగల బెడద..! లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు..!
తిరుపతిలో దైవ దర్శనాలకు వచ్చే భక్తులే టార్గెట్ గా చోరీలు జరుగుతున్నాయి. వరుసగా ఒకే హోటల్ లో రెండు ఘటనలు జరగడంతో అనుమానాలు పెరుగుతున్నా యి. ముందు ఘటనలో 20 లక్షలు మాయం కాగా తాజాగా రెండో ఘటనలో వెయ్యి డాలర్లు మాయమయ్యాయి.మానస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఈ ఘటన జరిగింది. సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి హోటల్ కి వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం అయ్యాయి.

రష్యాని వణికిస్తున్న ఉక్రెయిన్ వెపన్
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఒక వెరైటీ వెపన్ ని ప్రయోగిస్తోంది. రిమోట్ కంట్రోల్‌తో నడిచే, చక్రాలు కలిగిన ఒక చిన్న ల్యాండ్ డ్రోన్ కు పవర్‌ఫుల్ బాంబును అమర్చి రష్యా బంకర్లు, సైనిక స్థావరాల వైపు పంపిస్తోంది. అది శత్రువుల దగ్గరకు వెళ్లగానే పేలిపోతుంది. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ బాంబులు ఇప్పుడు రష్యన్లకు వణుకు పుట్టిస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రో భేష్ .. బ్రిటీష్ వ్లాగర్ వీడియో వైరల్!
యూకేకు చెందిన ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హైదరాబాద్ మెట్రో రైడ్ వీడియో SMలో ట్రెండ్ అవుతోంది. మెట్రో స్టేషన్ లుక్, కోచ్‌లలో పరిశుభ్రత, యాంబియెన్స్ చూసి అతడు ఫిదా అయ్యాడు.రైలు ఎక్కగానే సీటు సంపాదించిన ప్యాటర్సన్ ఇప్పటివరకు నేను చూసిన బెస్ట్ మెట్రోలలో ఇది ఒకటి. సూపర్ కూల్ అని ప్రశంసించాడు. లండన్ అండర్‌గ్రౌండ్ కంటే ఇక్కడ మెట్రో చాలా బాగుందన్నాడు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి

భార్య వేధింపులు తట్టుకోలేక సూరత్ వ్యక్తి ఏం చేశాడంటే ..?
భార్య, అత్తమామల మానసిక వేధింపులు తట్టుకోలేక గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని వింత కోరిక కోరాడు. తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని అతను జిల్లా కలెక్టర్ కు లేఖ రాశాడు. భార్య కేవలం డబ్బుల కోసమే తనపై గృహహింస కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించాడు. పురుషుల రక్షణకు చట్టాలు లేకపోవడంతో న్యాయం జరగడం లేదన్నాడు. కోర్టుల చుట్టూ ఇక తిరగలేనని తనకు కారుణ్య మరణానికి అనుమతినివ్వాలంటూ అతను కోరడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తుంగభద్రలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర (5), సతీష్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను (23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. వారంతా మంత్రాలయంలోని ఓ ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి పూజకు వచ్చి, సమీపంలోని తుంగభద్ర నదికి వెళ్లి ఈతకు దిగినట్లు సమాచారం.

ముస్లిమ్స్ కౌ-పాలిటిక్స్ అసలు ఉద్దేశం ఏంటంటే..
మన దేశంలో కౌ-పాలిటిక్స్ కొత్త రూపంలోకి మారాయ్.. ఇంతకాలం బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ చేతుల్లో ఉన్న గోరక్ష బ్యానర్లు.. ఇప్పుడు ముస్లింల చేతుల్లో కనిపిస్తున్నాయ్. మీరు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండీ అని సరికొత్త ఉద్యమాన్ని ఇండియన్ ముస్లిమ్స్ మొదలు పెట్టారు. దీని వెనుక అసలు వాస్తవాలేంటో చెప్తూ.. జర్నలిస్ట్ తులసి చందు చేసిన వీడియో Clear Cut News లోగో పైన క్లిక్ చేసి చూడొచ్చు
ఇది సినిమా గ్రాఫిక్స్ కాదు, తుఫాను విశ్వరూపం
రాజస్థాన్: ఇది బికనీర్‌లో ఇసుక తుఫాను తీవ్రతను చాటి చెప్పే వీడియో. సినిమాల్లో గ్రాఫిక్స్ ని మించి శనివారం మధ్యాహ్నం ఇసుక తుఫాను ఇళ్లను కమ్మేసింది. ఈ తుఫాను వల్ల రోడ్లపై ఏమీ కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. బలమైన గాలులకి చెట్ల కొమ్మలు విరిగిపడి చాలా చోట్ల కరెంట్ సప్లై ఆగిపోయింది.
congress, BJPకి KTR స్ట్రాంగ్ వార్నింగ్!
BRS లీడర్ KTR కాంగ్రెస్ అండ్ BJP పార్టీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. "మనల్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్, BJPలకు గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. అందరం కలిసి గట్టిగా ఫైట్ చేద్దాం.. ఇంకొక్క వన్ ఇయర్ కష్టపడితే చాలు" అంటూ BRS పార్టీ వాళ్లలో ఫుల్ జోష్ నింపారు. తమను ట్రబుల్ చేసిన వాళ్లకు వడ్డీతో సహా తిప్పికొడతామని చాలా అగ్రెసివ్‌గా చెప్పారు. KTR చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
అమరవీరుడి భార్యను తాగుబోతు అని అవమానించిన జనసేన లీడర్?
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు బాల్య కొమురయ్య అతని భార్య పూలమ్మను ఉద్దేశించి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీశాయి. పూలమ్మను తాగుబోతు అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై తెలంగాణ ప్రజలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వీరుడి భార్యను ఇలా మాట్లాడటం ఏంటంటూ కిరణ్ రాయల్‌ను నెట్టింట దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.