← Back to news

తుంగభద్రలో ఐదుగురు గల్లంతు

By Saivamshi· 30 May 2026· Andhrajyothy· Kurnool
తుంగభద్రలో ఐదుగురు గల్లంతు

కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర (5), సతీష్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను (23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. వారంతా మంత్రాలయంలోని ఓ ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి పూజకు వచ్చి, సమీపంలోని తుంగభద్ర నదికి వెళ్లి ఈతకు దిగినట్లు సమాచారం.

More in Local