Latest

Forbes Listలో భవిత మండవ
World· 31 May 2026

Forbes Listలో భవిత మండవ

హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల మోడల్ భవిత మండవ మరో గుర్తింపు దక్కించుకుంది. Chanel ఇండియన్ హౌస్ అంబాసిడర్‌గా ఉన్న భవిత Forbes 30 Under 30 Asia 2026 జాబితాలో చోటు సంపాదించింది. న్యూయార్క్ మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా దక్కిన ఒక చిన్న మోడలింగ్ ఛాన్స్‌ భవిత మండవ జీవితాన్ని మార్చేసింది. రీసెంట్ మెట్ గాలాలో బ్లూ జీన్స్‌తో బోల్డ్ ఎంట్రీ ఇచ్చి బ్రౌన్ గర్ల్స్ పవర్ ఏంటో చూపించిన భవిత.. ఇప్పుడు మన Gen Z కి బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్!

 బుడాపెస్ట్  సాకర్ టోర్నమెంట్ గెలుపు- పారిస్ లో అల్లర్లు !!
World· 31 May 2026

బుడాపెస్ట్ సాకర్ టోర్నమెంట్ గెలుపు- పారిస్ లో అల్లర్లు !!

పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG) క్లబ్ శనివారం బుడాపెస్ట్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో ఆర్సెనల్‌పై 4-3 తో పెనాల్టీ షూటౌట్‌లో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. అయితే, ఈ విజయోత్సవం కాస్త పారిస్ వీధుల్లో తీవ్ర హింసకు, విధ్వంసానికి దారితీసింది. ఆనందం కాస్తా అల్లర్లు, హింస, కార్ల దహనంగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయానికి ఒకరు ప్రాణాలు కోల్పోగా, 780 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 264 కంటే ఎక్కువ కార్లు కాలి బూడిదయ్యాయి. దాదాపు 20,000 మంది అభిమానులు ప్రసిద్ధ 'చాంప్స్-ఎలిసీస్' వీధిలోకి దూసుకొచ్చారు. రోడ్లపై ఎలక్ట్రిక్ బైకులను తగులబెట్టారు,

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
Crime· 31 May 2026

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

విశాఖ నగరం గాజువాకలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు చనిపోయారు. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపునకు వెళ్తోంది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇల్లు మన ఐడెంటిటీ.. రూ.లక్ష కోట్లకు చేరిన హోం డెకర్ మార్కెట్!
Business· 31 May 2026

ఇల్లు మన ఐడెంటిటీ.. రూ.లక్ష కోట్లకు చేరిన హోం డెకర్ మార్కెట్!

ఇండియాలో ఇప్పుడు ఇల్లు కొనడమే కాదు, దానికి స్టైలిష్ లుక్ ఇవ్వడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. యూట్యూబ్‌ హోమ్ టూర్స్, వర్క్ ఫ్రం హోమ్ కల్చర్‌తో ఇల్లు ఒక పర్సనల్ ఐడెంటిటీగా మారింది. దీంతో దేశీయ హోం ఇంటీరియర్ మార్కెట్ విలువ ఏకంగా 12 బిలియన్ డాలర్లకు (రూ.లక్ష కోట్లకు పైగా) చేరింది. కొత్తగా ఇల్లు కొనేవారు మోడ్యులర్ కిచెన్స్, స్మార్ట్ లైటింగ్ కోసమే ప్రాపర్టీ వాల్యూలో 10% నుండి 20% వరకు అదనంగా ఖర్చు చేస్తున్నారు. క్లాసీ లుక్ కోసం చూస్తుండటంతో ఈ మార్కెట్ 13% వృద్ధితో దూసుకుపోతోంది.

అసెంబ్లీల్లో తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం!
Politics· 31 May 2026

అసెంబ్లీల్లో తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం!

ఇటీవలి ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం దేశంలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతోంది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 823 స్థానాలకు గాను కేవలం 107 మంది మాత్రమే ఎన్నికయ్యారు. ముఖ్యంగా అసోంలో ఈ సంఖ్య 31 నుండి 22కి, పశ్చిమ బెంగాల్‌లో 42 నుండి 40కి పడిపోయింది. అయితే కేరళ (35), తమిళనాడు (9) మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా పాజిటివ్ గ్రోత్ చూపించాయి. జనాభా నిష్పత్తి కంటే ఈ ప్రాతినిధ్యం 1% తక్కువగా ఉండటం గమనార్హం.

తిరుపతిలో దొంగల బెడద..!  లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు..!▶
Crime· 31 May 2026

తిరుపతిలో దొంగల బెడద..! లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు..!

తిరుపతిలో దైవ దర్శనాలకు వచ్చే భక్తులే టార్గెట్ గా చోరీలు జరుగుతున్నాయి. వరుసగా ఒకే హోటల్ లో రెండు ఘటనలు జరగడంతో అనుమానాలు పెరుగుతున్నా యి. ముందు ఘటనలో 20 లక్షలు మాయం కాగా తాజాగా రెండో ఘటనలో వెయ్యి డాలర్లు మాయమయ్యాయి.మానస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఈ ఘటన జరిగింది. సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి హోటల్ కి వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం అయ్యాయి.

రష్యాని వణికిస్తున్న ఉక్రెయిన్ వెపన్
World· 31 May 2026

రష్యాని వణికిస్తున్న ఉక్రెయిన్ వెపన్

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఒక వెరైటీ వెపన్ ని ప్రయోగిస్తోంది. రిమోట్ కంట్రోల్‌తో నడిచే, చక్రాలు కలిగిన ఒక చిన్న ల్యాండ్ డ్రోన్ కు పవర్‌ఫుల్ బాంబును అమర్చి రష్యా బంకర్లు, సైనిక స్థావరాల వైపు పంపిస్తోంది. అది శత్రువుల దగ్గరకు వెళ్లగానే పేలిపోతుంది. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఈ బాంబులు ఇప్పుడు రష్యన్లకు వణుకు పుట్టిస్తున్నాయి.

హైదరాబాద్ మెట్రో భేష్ .. బ్రిటీష్ వ్లాగర్ వీడియో వైరల్!▶
Viral· 31 May 2026

హైదరాబాద్ మెట్రో భేష్ .. బ్రిటీష్ వ్లాగర్ వీడియో వైరల్!

యూకేకు చెందిన ట్రావెల్ వ్లాగర్ ఇషాక్ ప్యాటర్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హైదరాబాద్ మెట్రో రైడ్ వీడియో SMలో ట్రెండ్ అవుతోంది. మెట్రో స్టేషన్ లుక్, కోచ్‌లలో పరిశుభ్రత, యాంబియెన్స్ చూసి అతడు ఫిదా అయ్యాడు.రైలు ఎక్కగానే సీటు సంపాదించిన ప్యాటర్సన్ ఇప్పటివరకు నేను చూసిన బెస్ట్ మెట్రోలలో ఇది ఒకటి. సూపర్ కూల్ అని ప్రశంసించాడు. లండన్ అండర్‌గ్రౌండ్ కంటే ఇక్కడ మెట్రో చాలా బాగుందన్నాడు. ఆ వీడియో మీరు కూడా చూసేయండి

భార్య వేధింపులు తట్టుకోలేక సూరత్ వ్యక్తి ఏం చేశాడంటే ..?
India· 31 May 2026

భార్య వేధింపులు తట్టుకోలేక సూరత్ వ్యక్తి ఏం చేశాడంటే ..?

భార్య, అత్తమామల మానసిక వేధింపులు తట్టుకోలేక గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని వింత కోరిక కోరాడు. తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని అతను జిల్లా కలెక్టర్ కు లేఖ రాశాడు. భార్య కేవలం డబ్బుల కోసమే తనపై గృహహింస కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించాడు. పురుషుల రక్షణకు చట్టాలు లేకపోవడంతో న్యాయం జరగడం లేదన్నాడు. కోర్టుల చుట్టూ ఇక తిరగలేనని తనకు కారుణ్య మరణానికి అనుమతినివ్వాలంటూ అతను కోరడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తుంగభద్రలో ఐదుగురు గల్లంతు
Local· 30 May 2026

తుంగభద్రలో ఐదుగురు గల్లంతు

కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర (5), సతీష్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను (23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. వారంతా మంత్రాలయంలోని ఓ ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి పూజకు వచ్చి, సమీపంలోని తుంగభద్ర నదికి వెళ్లి ఈతకు దిగినట్లు సమాచారం.

ముస్లిమ్స్ కౌ-పాలిటిక్స్ అసలు ఉద్దేశం ఏంటంటే..
Politics· 30 May 2026

ముస్లిమ్స్ కౌ-పాలిటిక్స్ అసలు ఉద్దేశం ఏంటంటే..

మన దేశంలో కౌ-పాలిటిక్స్ కొత్త రూపంలోకి మారాయ్.. ఇంతకాలం బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ చేతుల్లో ఉన్న గోరక్ష బ్యానర్లు.. ఇప్పుడు ముస్లింల చేతుల్లో కనిపిస్తున్నాయ్. మీరు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండీ అని సరికొత్త ఉద్యమాన్ని ఇండియన్ ముస్లిమ్స్ మొదలు పెట్టారు. దీని వెనుక అసలు వాస్తవాలేంటో చెప్తూ.. జర్నలిస్ట్ తులసి చందు చేసిన వీడియో Clear Cut News లోగో పైన క్లిక్ చేసి చూడొచ్చు

ఇది సినిమా గ్రాఫిక్స్ కాదు, తుఫాను విశ్వరూపం▶
Politics· 30 May 2026

ఇది సినిమా గ్రాఫిక్స్ కాదు, తుఫాను విశ్వరూపం

రాజస్థాన్‌: ఇది బికనీర్‌లో ఇసుక తుఫాను తీవ్రతను చాటి చెప్పే వీడియో. సినిమాల్లో గ్రాఫిక్స్ ని మించి శనివారం మధ్యాహ్నం ఇసుక తుఫాను ఇళ్లను కమ్మేసింది. ఈ తుఫాను వల్ల రోడ్లపై ఏమీ కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. బలమైన గాలులకి చెట్ల కొమ్మలు విరిగిపడి చాలా చోట్ల కరెంట్ సప్లై ఆగిపోయింది.

congress, BJPకి KTR స్ట్రాంగ్ వార్నింగ్!▶
Politics· 30 May 2026

congress, BJPకి KTR స్ట్రాంగ్ వార్నింగ్!

BRS లీడర్ KTR కాంగ్రెస్ అండ్ BJP పార్టీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. "మనల్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్, BJPలకు గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. అందరం కలిసి గట్టిగా ఫైట్ చేద్దాం.. ఇంకొక్క వన్ ఇయర్ కష్టపడితే చాలు" అంటూ BRS పార్టీ వాళ్లలో ఫుల్ జోష్ నింపారు. తమను ట్రబుల్ చేసిన వాళ్లకు వడ్డీతో సహా తిప్పికొడతామని చాలా అగ్రెసివ్‌గా చెప్పారు. KTR చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

అమరవీరుడి భార్యను తాగుబోతు అని అవమానించిన జనసేన లీడర్?▶
Politics· 30 May 2026

అమరవీరుడి భార్యను తాగుబోతు అని అవమానించిన జనసేన లీడర్?

తెలంగాణ ఉద్యమ అమరవీరుడు బాల్య కొమురయ్య అతని భార్య పూలమ్మను ఉద్దేశించి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీశాయి. పూలమ్మను తాగుబోతు అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై తెలంగాణ ప్రజలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వీరుడి భార్యను ఇలా మాట్లాడటం ఏంటంటూ కిరణ్ రాయల్‌ను నెట్టింట దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్: ఇండియా వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు!▶
Politics· 30 May 2026

'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్: ఇండియా వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు!

సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఇండియాకు తిరిగి వస్తే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ ఓపెన్ అయ్యాడు. అసలు ఈ వైరల్ మూవ్‌మెంట్ ఏంటి, ఇది ఇంత స్పీడ్‌గా ఎలా పెరిగింది, ప్రెజెంట్ యూత్‌ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాల గురించి మాట్లాడాడు. ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు ప్లాన్!
Politics· 30 May 2026

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు ప్లాన్!

మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడంపై AP CM చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డీలిమిటేషన్ వల్ల మనకు నష్టం రాకుండా ఉండాలంటే సీట్లను 50% పెంచాలని, ఆ పెంచిన సీట్లనే మహిళలకు ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు బిల్లులను తీసుకురావడానికి రెడీ అవుతోందని, రెండింటినీ కలిపి తెస్తేనే మహిళలకు ఫుల్ బెనిఫిట్ ఉంటుందని అన్నారు. ఈ బిల్లులు దేశ పాలిటిక్స్‌ను టోటల్‌గా మార్చేస్తాయని చంద్రబాబు చెప్పారు.

గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం
Local· 30 May 2026

గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం

TG: నేటి యూత్ గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానురు విలేజ్‌లో ఏర్పాటు చేసిన పీపీఆర్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి యూత్ ఎక్కువ టైమ్ ఫోన్లు, సోషల్ మీడియాకే పరిమితం కాకుండా గేమ్స్‌లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌లో రాణించేలా కృషి చేయాలని కోరారు.

ఢిల్లీ పెద్దల ప్రపోజల్‌కు డీకే శివకుమార్ నో!
Politics· 30 May 2026

ఢిల్లీ పెద్దల ప్రపోజల్‌కు డీకే శివకుమార్ నో!

కర్ణాటక కొత్త CMగా జూన్ 3rd డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే తన క్యాబినెట్‌లో నలుగురు డిప్యూటీ CMలను పెట్టాలనే ప్రపోజల్‌ను ఆయన రిజెక్ట్ చేశారు. అంతమందిని పెడితే పార్టీలో మిగతా సీనియర్స్ హర్ట్ అవుతారని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. శనివారం మధ్యాహ్నం 4గంటలకు జరిగే సీఎల్‌పీ మీటింగ్‌లో లీడర్‌ను అఫీషియల్‌గా సెలెక్ట్ చేయనున్నారు. ఫస్ట్ డీకేతో పాటు కొద్దిమంది మంత్రులే ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ తర్వాత ఎంబీ పటేల్, ప్రియాంక్ ఖర్గే లాంటి సీనియర్లకు క్యాబినెట్‌లో ఛాన్స్ దొరకనుందని టాక్.

రియల్ హీరో అంటే ఇతనే!▶
Politics· 30 May 2026

రియల్ హీరో అంటే ఇతనే!

కర్ణాటక బైటరాయణపురలో అనిల్ కుమార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. హెవీ రెయిన్ వల్ల ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ రోడ్డు క్రాస్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుండటం గమనించిన అనిల్ కుమార్ వెంటనే వెళ్ళి, ఆ పర్సన్‌ని తన భుజాల మీద ఎక్కించుకుని సేఫ్‌గా రోడ్డు దాటించాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆ కానిస్టేబుల్‌ని మెచ్చుకుంటున్నారు.

డెప్యూటీ స్పీకర్ Vs IPS: పాలిటిక్స్ నుండి తప్పుకుంటావా అంటూ ఛాలెంజ్!▶
Politics· 30 May 2026

డెప్యూటీ స్పీకర్ Vs IPS: పాలిటిక్స్ నుండి తప్పుకుంటావా అంటూ ఛాలెంజ్!

డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు IPS పీవీ సునీల్ కుమార్ గట్టి ఛాలెంజ్ విసిరారు. నీకు అంత నమ్మకం ఉంటే వెంటనే రిజైన్ చేసి, నీకు నచ్చిన పార్టీ నుండి టికెట్ తెచ్చుకో. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా, అంటూ సునీల్ కుమార్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. నీకంటే ఒక్క వెయ్యి ఓట్లు తక్కువ వచ్చినా నేను పాలిటిక్స్ మాట్లాడటం బంద్ చేస్తా, మరి నాకంటే తక్కువ ఓట్లు వస్తే నువ్వు పాలిటిక్స్ నుండి తప్పుకుంటావా అంటూ రఘురామకు కౌంటర్ ఇచ్చారు.

భారత తీరప్రాంతానికి క్లైమేట్ ముప్పు.. షాకింగ్ రిపోర్ట్
General· 30 May 2026

భారత తీరప్రాంతానికి క్లైమేట్ ముప్పు.. షాకింగ్ రిపోర్ట్

భారతదేశానికి ఉన్న 11,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతానికి రాబోయే కాలంలో తీవ్ర పర్యావరణ ముప్పు పొంచి ఉందని 'అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ' నివేదిక హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ముంబై, కేరళ, తమిళనాడు సహా 40 తీరప్రాంత జిల్లాల్లో అసాధారణ ఎండలు, భారీ వర్షాలు, తీవ్రమైన తుఫానులు రానున్నాయి. దీనివల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు, 2050 నాటికి సముద్ర మట్టాలు పెరిగి ఒడిశా వంటి రాష్ట్రాల్లో తీరప్రాంత గ్రామాలు జనాభా లేక ఒక స్మశానంలా మారే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.