మళ్లీ పెట్రో బాదుడు.. రెండు వారాల్లో 4వ సారి పెంపు

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో దేశంలో ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. లీటర్ పెట్రోల్‌పై ₹2.61, డీజిల్‌పై ₹2.71 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది నాలుగోసారి. ఈ తాజా బాదుడుతో ఎప్పుడూ రేట్లు తక్కువగా ఉండే దేశ రాజధాని ఢిల్లీలోనూ లీటర్ పెట్రోల్ ధర ₹100 మార్క్‌ను దాటి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడమే దీనికి కారణం.



