ఇంకా పాఠాలు నేర్చుకోలేదా?.. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం ఆగ్రహం

వరసగా ఏళ్లకి ఏళ్లు వివాదాల తర్వాత కూడా ఈసారి నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంత జరిగినా అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరం అని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరిస్తూ.. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.



