బెంగళూరు భారీ సైబర్ మోసం. మహిళ నుంచి 24 కోట్లు దోపిడి

బెంగళూరులో 74 ఏళ్ల లక్ష్మీ రామమూర్తి అనే మహిళ డిజిటల్ అరెస్ట్ బారిన పడి ఏకంగా రూ.24 కోట్లు కోల్పోయారు. CBI, ED అధికారులమని చెప్పిన సైబర్ మోసగాళ్లు వీడియో కాల్ చేసి మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉందంటూ భయపెట్టారు. ఆస్తులు అమ్మిన ఆమె డబ్బులన్నీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 26 లావాదేవీల్లో మొత్తం 23 అకౌంట్లలో జమ చేయించుకున్నారు. 1.3 కేజీల బంగారం తాకట్టు పెట్టడానికి ఆమె బ్యాంకుకి వెళ్లినప్పుడు మేనేజర్ కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ భారీ స్కామ్ బయటపడింది. పోలీసులు రంగంలోకి దిగి ₹5.46 కోట్లు ఫ్రీజ్ చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.



