ముగ్గురు AIADMK ఎమ్మెల్యేలు రాజీనామా.. టీవీకేలోకి జంప్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ప్రతిపక్ష AIADMKకి చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార TVK పార్టీలో చేరారు. మధురాంతకం ఎమ్మెల్యే మరగాథం కుమారవేల్, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ సోమవారం స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. స్పీకర్ వాటిని వెంటనే ఆమోదించారు.



