Latest

రాజస్థాన్లో ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కుక్కను చంపిన వైనం
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రాజ్‌గఢ్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి గోడ దాటి లోపలికి వచ్చిన చిరుత, గొలుసుతో కట్టిన పెంపుడు కుక్కపై దాడి చేసింది. సుమారు 16 నిమిషాల పాటు జరిగిన పోరులో కుక్కను చంపి, శరీరాన్ని నోట పట్టుకుని అడవి వైపు పారిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. చిరుత ఇంట్లోకి రావడం పట్ల స్థానికులు భయపడుతున్నారు.
విరాట్ కోహ్లీ బిహేవియర్ పై క్రికెట్ ఫాన్స్ ఫైర్!
నిన్న జరిగిన SRH vs RCB మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ బిహేవియర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ క్లోస్ అయిన తర్వాత తబ్రైజ్ షంసీ షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి చేయి ఇవ్వగా. కోహ్లీ అతని వైపు అసలు చూడకుండానే ముందుకు వెళ్ళిపోయాడు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా డిసపాయింట్ అవుతున్నారు. గ్రౌండ్ లో ఇలాంటి బిహేవియర్ అస్సలు యాక్సెప్టబుల్ కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాజ్యసభలో తగ్గనున్న ఎన్డీఏ బలం--విజయ్ కు ఒక సీటు
రాజ్యసభలోని 26 స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ బలం 17కి తగ్గే అవకాశం ఉండగా, కాంగ్రెస్ సీట్లు 5కి పెరగనున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ, ఏపీలో టీడీపీ మెజారిటీ స్థానాలు గెలవనున్నాయి. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒక స్థానంతో రాజ్యసభలోకి ఎంట్రీ ఇస్తుండగా, జార్ఖండ్‌లో జేఎమ్ఎమ్-కాంగ్రెస్ కూటమి రెండు స్థానాలను కైవసం చేసుకోనుంది. పోలింగ్ జరిగే 26 సీట్లలో ఎన్డీఏకు18, కాంగ్రెస్ కు 4, వైసీపీకి 3, జెఎంఎంకు ఒక స్థానం ఉన్నాయి.

వైఫ్ చనిపోయిన రెండు రోజులకే హస్బండ్ సూసైడ్!
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక shocking ఇన్సిడెంట్ జరిగింది. సిద్ధార్థ్, మేఘన అనే కపుల్‌కి మ్యారేజ్ అయిన వన్ మంత్ లోపే ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత వీరు ఓన్లీ 5 డేస్ మాత్రమే కలిసి ఉన్నారు. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లిన మేఘన అక్కడ ఉరి వేసుకుని చనిపోయింది. భార్య డెత్ తో డిప్రెషన్‌లోకి వెళ్లిన భర్త సిద్ధార్థ్. రెండు రోజులకే బాత్‌రూమ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. ఈ చావుల వెనుక ఉన్న రీజన్స్ ఏంటో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
లిటిల్ ఫ్యాన్‌కి సారీ చెప్పిన రోహిత్ శర్మ!
కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ హోటల్ దగ్గర రోహిత్ శర్మను చూడటానికి ఒక చిన్న పాప వెయిట్ చేసింది. అయితే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో రోహిత్ ఆమెను గమనించకుండానే వెళ్ళిపోయారు. దీంతో ఆ చిన్నారి ఏడవడం స్టార్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రోహిత్ శర్మ స్పందించారు. ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఆ పాపకి సారీ చెప్పారు. నెక్స్ట్ టైమ్ కోల్‌కతా వచ్చినప్పుడు కచ్చితంగా నిన్ను కలుస్తానని ప్రామిస్ చేశారు.

వందే భారత్ స్లీపర్ పైకంటెంట్ క్రియేటర్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స
వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించిన ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ రుచి త్రివేది అనుభవం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ కొత్త జనరేషన్ రైలు లుక్, డిజైన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ఆమె తెగ పొగిడేసింది. ముఖ్యంగా సెకండ్ ఏసీ కోచ్‌లోని మోడ్రన్ కర్టెన్లు, లైటింగ్, నీట్ బెడ్డింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయని మెచ్చుకుంది. ప్రభుత్వం ఇంత సూపర్ ట్రైన్ ఇచ్చింది కాబట్టి, దీన్ని క్లీన్‌గా ఉంచడం మన బాధ్యత అంటూ సివిక్ సెన్స్ గురించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కామాఖ్య- హౌరా వందే భారత్ స్లీపర్ సర్వీస్ లో ఆమె ప్రయాణించారు.

బొద్దింకలు తల లేకపోయినా బతికేస్తాయి!
బొద్దింకలు డైనోసర్ల కంటే ముందే అంటే 30 కోట్ల ఇయర్స్ నుంచే భూమిపై ఉన్నాయి. వీటికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు ఏంటంటే.. బొద్దింకల హెడ్ కట్ అయినా కూడా అవి కొన్ని డేస్ లైవ్‌గా ఉండగలవు. ఎందుకంటే అవి బాడీపై ఉండే చిన్న హోల్స్ ద్వారా బ్రీతింగ్ తీసుకుంటాయి. అంతేకాదు, ఇవి 40 మినిట్స్ వరకు వాటర్ లో బ్రీతింగ్ ఆపగలవు. గంటకు 5KM స్పీడ్ తో రన్ చేయగలవు.
ఎండ దెబ్బకి ఈ బైకర్ ఐడియా చూస్తే షాకవుతారు!
తెలంగాణలో ఎండలు మామూలుగా లేవు. ఈ హీట్ వేవ్ నుంచి తప్పించుకోవడానికి జనాలు రకరకాల ఐడియాలు వాడుతున్నారు. రీసెంట్‌గా ఒకతను బైక్ నడుపుతూ ఎండ తగలకుండా తలపై పచ్చటి కానుగ ఆకులు పెట్టుకున్నాడు. ఈ వీడియొ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

10 ఇయర్స్ గర్ల్ మర్డర్.. సీరియస్ అయిన CM విజయ్!
తమిళనాడులోని కోయంబత్తూరులో సరుకులు కొనడానికి బయటకు వెళ్లిన 10 years గర్ల్ కిడ్నాప్ అండ్ మర్డర్‌కి గురైంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. దీనిపై CM జోసెఫ్ విజయ్ ట్వీట్ చేస్తూ. ఇలాంటి క్షమించరాని క్రైమ్ ను అస్సలు accept చేయమని, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేస్తామని X లో పోస్ట్ చేశారు. ప్రెసెంట్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ DGP స్వయంగా కోయంబత్తూరు వెళ్లారు.

కాక్రోచ్ పార్టీ బ్యాన్‌పై జర్నలిస్ట్ తులసీ చందు షాకింగ్ ట్వీట్!
కాక్రోచ్ జనతా పార్టీ వెబ్‌సైట్‌ను గవర్నమెంట్ డౌన్ చేయడంపై జర్నలిస్ట్ తులసీ చందు X లో స్పందించారు. రూలింగ్‌లో ఉన్న వాళ్లకు ఈమాత్రం భయం ఉండాల్సిందేనంటూ కామెంట్ చేశారు. కేసులతో ఈ దేశ యూత్ గొంతు నొక్కడం ఎవరికీ సాధ్యం కాదని, టైమ్ దగ్గర పడిందని చెప్పడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక సైన్ అంటూ ట్వీట్ చేశారు.

జనసేన పార్టీ MLA అరవ శ్రీధర్ రిసైన్!
పదవిలోకి వచ్చిన 5 నెలలకే జనసేన MLA అరవ శ్రీధర్ తన విప్ పోస్ట్‌కి రిసైన్ చేశారు. ఓన్లీ పర్సనల్ రీజన్స్ వల్లే తను ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెబుతూ.. తన రాజీనామా లెటర్‌ను పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌కు పంపించారు. అయితే, అరవ శ్రీధర్‌పై వచ్చిన కొన్ని అలిగేషన్స్ పై త్రీ-మెంబర్ కమిటీ రీసెంట్‌గా రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాతే ఈ డెవలప్‌మెంట్ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దేశంలో పెట్రో ధర మండిపోతున్న నగరం ఏంటో తెలుసా ?
పది రోజుల్లో పెట్రో ధరలు ఏకంగా మూడు సార్లు పెరగడం వల్ల అత్యధిక ధర ఏ నగరంలో ఉందో తెలుసా ? అది మన హైదరాబాద్. దేశంలో లీటర్ పెట్రోల్ హైదరాబాద్ లో ఏకంగా రూ.113గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో తిరువనంతపురం, పాట్నా ఉన్నాయి.దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే value added taxes వ్యాట్ పన్నులే. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20% వ్యాట్ విధిస్తున్నారు, ఇది మిగతా మెట్రో నగరాల కంటే చాలా ఎక్కువ. దీనికి తోడు డీలర్ కమీషన్లు, రవాణా ఖర్చులు కూడా తోడవడంతో భాగ్యనగరంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.

'కాక్రోచ్ జనతా పార్టీ' వెబ్‌సైట్ బ్యాన్
తమ ఐకానిక్ వెబ్‌సైట్ (cockroachjantaparty.org) ని గవర్నమెంట్ డౌన్ చేసిందని అభిజీత్ దీప్కే X లో పోస్ట్ చేశారు. తమ వెబ్‌సైట్‌లో 10 లక్షల మంది కాక్రోచెస్ మెంబర్స్‌గా జాయిన్ అయ్యారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ 6 లక్షల మంది సైన్ చేశారని చెప్పారు. గవర్నమెంట్ కాక్రోచెస్‌కి ఎందుకు భయపడుతోంది? ఈ డిక్టేటర్ బిహేవియర్ చూసి యూత్ కళ్ళు తెరుచుకుంటున్నాయి. మేము ఈజీగా వదిలిపెట్టం, కొత్త హోమ్ రెడీ చేస్తున్నాం, కాక్రోచెస్ ఎప్పటికీ చనిపోరు అంటూ X లో పోస్ట్ చేశారు.
ప్రకాష్ రాజ్ షాకింగ్ ట్వీట్: ‘నేడు నాగేశ్వర్.. రేపు ఎవరు?’
ఫేమస్ ఆక్టర్ ప్రకాష్ రాజ్ తన X అకౌంటు లో ఒక వీడియొ చేసి పోస్ట్ చేశారు. రీసెంట్‌గా ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై TDP కేస్ ఫైల్ చెయ్యడం, trolling చేయడం పై ఆయన రియాక్ట్ అయ్యారు. ప్రశ్నించే గొంతులను కేసులతో సైలెంట్ చేయడం చాలా డేంజర్ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ తన మద్దతును నాగేశ్వర్ కి ప్రకటించాడు. అలాగే "ఈరోజు నాగేశ్వర్.. రేపు ఎవరు?" అంటూ తన స్టైల్‌లో #justasking హ్యాష్‌టాగ్‌తో గవర్నమెంట్‌ను నిలదీశారు.

రుక్మిణి వసంత్ బికినీ పిక్చర్స్ ఫేక్
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న కన్నడ నటి రుక్మిణీ వసంత్ బికీనీ షూట్ విజువల్స్‌పై అన్నీ పూర్తిగా ఫేక్ .. ఆ ఫోటోలు, వీడియోలుడీప్‌ఫేక్ టెక్నాలజీతో ఎవరో కావాలనే తన ముఖాన్ని మార్చేసి క్రియేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ ఎవరూ వీటిని నమ్మవద్దని, వైరల్ చేయొద్దని కోరారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

CJP ఇన్ స్టా అకౌంట్ బ్లాక్ మళ్లీ రెస్టోర్
కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ డిజిటల్ క్రియేటర్ అభిజీత్ దీప్కేకు ఇన్‌స్టాగ్రామ్ గట్టి షాక్ ఇచ్చింది. ఆయన రన్ చేస్తున్న CJP బ్యాకప్ అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ మే 23న కాసేపు బ్లాక్ చేసింది. రూల్స్ ఉల్లంఘించారంటూ అకౌంట్‌ను తొలగించినట్లు మెసేజ్ పంపారు. అయితే, ఆయన అప్పీల్ చేయడంతో కొద్దిసేపటికే అకౌంట్‌ను మళ్లీ రిస్టోర్ చేశారు. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బెంజ్ కారు ఉంటేనే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్?
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ను కలవడంపై ఒక జనసైనికుడు చేసిన shocking కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒంటి నిండా బంగారం, లగ్జరీ బెంజ్ కార్లు ఉన్న వాళ్లకే ఆయన అపాయింట్‌మెంట్ దొరుకుతోందని, కామన్ కార్యకర్తలను పక్కన పెట్టేస్తున్నారని ఓపెన్‌గా చెప్తూ ఆ పార్టీ కార్యకర్త బాధపడ్డాడు. పవన్ చుట్టూ ఉన్న ఒక ‘కార్పొరేట్ గ్యాంగ్’ వల్లే ఆయన నార్మల్ పీపుల్‌కి దూరమవుతున్నారంటూ సోషల్ మీడియాలో జనసైనికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేన్స్‌లో ఐష్ బ్లూ మ్యాజిక్
వెయిటింగ్ ఓవర్! కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ రాయల్ ఎంట్రీ ఇచ్చారు. ఇండియన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన మెటాలిక్ బ్లూ మెర్మైడ్ గౌన్‌లో ఆమె దేవకన్యలా మెరిసిపోయారు. 1,500 గంటల చేతిపనితో తయారైన ఈ స్పెషల్ డ్రెస్, వింగ్స్ డిజైన్‌తో ‘మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ’ని ఇచ్చింది. 24వ సారి కేన్స్ రెడ్‌కార్పెట్‌పై నడిచిన ఐష్.. తన నమస్తే, ఫ్లయింగ్ కిస్సెస్‌తో కెమెరాలను తనవైపే తిప్పుకున్నారు.
హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియన్స్… ఎవరెస్ట్ పైకి All Women Team
మన దేశ మహిళా శక్తి పవరేంటో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం (8,848 మీటర్లు) పై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుకి చెందిన మొదటి ‘ఆల్-ఉమెన్’ బృందం మే 21న ఉదయం 6:52 కి ఎవరెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించింది. 14 మంది సభ్యులున్న ఈ టీమ్ లో 11 మంది మహిళా క్లైంబర్లు, ముగ్గురు సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. క్లిష్టమైన సౌత్ కోల్ రూట్ లో మైనస్ డిగ్రీల చలిని, తక్కువ ఆక్సిజన్ స్థాయిలను తట్టుకుంటూ వీరంతా పైకి చేరారు. 'క్లీన్ హిమాలయా' భాగంగా పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తను కూడా సేకరించి శభాష్ అనిపించుకున్నారు.

ఇవాంకా హత్యకు ఇరాన్ కుట్ర ..!
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను హత్య చేసేందుకు జరిగిన ఒక భారీ కుట్ర బయటపడింది. ఇరాన్ మద్దతున్న కతైబ్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన మహ్మద్ బాకర్ సాద్ దావుద్ అల్-సాది (32) అనే ఇరాకీ ఉగ్రవాదిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ ఖాసిం సులేమానీ చనిపోవడానికి రివెంజ్‌గా ఇవాంకాను టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఫ్లోరిడాలోని ఇవాంకా లగ్జరీ ప్యాలెస్ మ్యాప్, బ్లూప్రింట్ కూడా ఆ ఉగ్రవాది దగ్గర దొరకడం సంచలనంగా మారింది. అమెరికా అధికారులు అతనిని సీక్రెట్ గా విచారిస్తున్నారు.

తెలంగాణ నిప్పుల కుంపటి.. 20 జిల్లాల్లో 46 డిగ్రీలు
తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రోహిణి కార్తెకు ముందే ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 31 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ దాటాయి. సిర్పూర్‌లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఎండ తీవ్రతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కదులుతున్న ఒక స్కూటీ కూడా అగ్నికి ఆహుతైంది. మరో వారం రోజులు ఎండల ధాటి ఇలాగే ఉండనుంది.