Latest

జూన్ 13న స్కూళ్లు క్లీన్ చేయనున్న బీజేపీ నేతలు▶
TG· 9 Jun 2026

జూన్ 13న స్కూళ్లు క్లీన్ చేయనున్న బీజేపీ నేతలు

TG: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక పిలుపునిచ్చారు. 'స్వచ్ఛ పాఠశాల' పేరిట ఈ నెల 11న 'టిఫిన్ బైఠక్', 13న బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు స్వయంగా క్లాస్ రూమ్‌లను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టనున్నారు. జూన్ 16న గ్రామాలు, పట్టణాల్లో బడిబాట నిర్వహించి, పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తెస్తామని బండి సంజయ్ తెలిపారు.

'రేవంత్ రెడ్డి పవర్‌లోకి రాగానే హిట్లర్‌లా మారారు'
Politics· 9 Jun 2026

'రేవంత్ రెడ్డి పవర్‌లోకి రాగానే హిట్లర్‌లా మారారు'

TG: CM రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బట్లర్‌లా ఉండి.. పవర్‌లోకి రాగానే హిట్లర్‌గా మారారని భువనగిరి మాజీ MP, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మంగళవారం నాంపల్లి BJP స్టేట్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసే దమ్ములేదని, ఆ పార్టీ నాయకులకు మైక్ దొరికితే మాత్రం బీజేపీని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తిడుతున్నారన్నారు. మెట్రో, RRRకి కిషన్ రెడ్డి నిధులు తెస్తే రేవంత్.. మూసీ నదిలో గడ్డి పీకడానికి ఉన్నారా? అని ప్రశ్నించారు.

వెట్టిచాకిరి గుట్టురట్టు..  10మంది కార్మికులకు విముక్తి
AP· 9 Jun 2026

వెట్టిచాకిరి గుట్టురట్టు.. 10మంది కార్మికులకు విముక్తి

AP: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రెండు ఇటుక బట్టీలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు మేరకు వెట్టిచాకిరిపై అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కోనేటి శ్రీను ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన పది మంది కార్మికులను వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారు. వీరికి వైద్య పరీక్షలు చేయించి వారి స్వగ్రామానికి పంపిస్తున్నట్లు లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు తెలిపారు.

స్వచ్ఛపాఠశాల పేరుతో  బండి సంజయ్ వినూత్న ప్రొగ్రామ్
Politics· 9 Jun 2026

స్వచ్ఛపాఠశాల పేరుతో బండి సంజయ్ వినూత్న ప్రొగ్రామ్

TG: నరేంద్ర మోదీ ప్రభుత్వం 12ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ స్కూళ్లను 'స్వచ్చ పాఠశాల' పేరుతో పరిశుభ్రం చేయాలని సంకల్పించారు. ఈ నెల 13వ తేదీన 7 అసెంబ్లీ నియోజవర్గాల్లోని అన్ని ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలన్నింటిన్నీ క్లీన్ చేయాలని నిర్ణయించారు.

మైండ్ రీచార్జ్ కావాలంటే సైలెన్స్  బెస్ట్ !
Health· 9 Jun 2026

మైండ్ రీచార్జ్ కావాలంటే సైలెన్స్ బెస్ట్ !

రోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా గడపడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్, బోస్టన్ యూనివర్సిటీల ఉమ్మడి అధ్యయనం ప్రకారం.. కాసేపు ప్రశాంతంగా మౌనం పాటించడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఈ అలవాటు మెదడులోని వివిధ భాగాలను అనుసంధానించి, ఆలోచనా శక్తిని మెరుగుపరచడమే కాకుండా మానసిక దృఢత్వాన్ని ఇస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

143  ఏళ్ల క్రితం కేదార్ నాథ్ ఎలా ఉండేదంటే ..
Infotainment· 9 Jun 2026

143 ఏళ్ల క్రితం కేదార్ నాథ్ ఎలా ఉండేదంటే ..

ఇది 1882 నాటి పురాతన ఫోటో.. హిమాలయాల సరసన ఉన్న పవిత్ర కేదార్ నాథ్ ఆలయం.కిక్కిరిసిన భక్తులు,హెలికాప్టర్ సర్వీసులు,రద్దీ మార్కెట్లు లేని టైమ్ లోది. కేవలం హిమాలయాలు, ప్రకృతి మాత్రమే ఈ ఆలయానికి సజీవ సాక్ష్యాలు. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో భీమశిల అనే రాతితో కట్టినది.తీర్ధ యాత్ర విహార యాత్రగా మారని క్రితం 143 ఏళ్ల క్రితం నాటి ఫోటో. రణగొణ ధ్వని లేని రద్దీ లేని ఓ చారిత్రక అద్భుతం.మహాభారతానికి సాక్ష్యంగా భావించే ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెబుతారు.

రైతుభరోసా వద్దని రెండునెలలు తిరిగాను: బీ.సుదర్శన్‌రెడ్డి
TG· 9 Jun 2026

రైతుభరోసా వద్దని రెండునెలలు తిరిగాను: బీ.సుదర్శన్‌రెడ్డి

TG: CM రేవంత్ రెడ్డి కౌలు రైతులకు ఇచ్చిన హామీతో పాటు వరంగల్ డిక్లరేషన్‌ను ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ బీ.సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాకు సుప్రీంకోర్టు నుంచి పెన్షన్ వస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తాను. ఉండటానికి ఇల్లు కూడా ఉంది. అయినా నాకు రైతుభరోసా ఇస్తుంటే దాన్ని వదిలించుకోవడానికి రెండునెలలు అధికారుల చుట్టూ తిరిగానన్నారు. మొత్తానికి రైతుభరోసాను వదిలించుకున్నట్లు చెప్పారు.

జనరేటర్ పేలి బ్యాంక్‌లో మంటలు
News· 9 Jun 2026

జనరేటర్ పేలి బ్యాంక్‌లో మంటలు

TG: ఖమ్మం జిల్లా ఏన్కూరు SBI బ్యాంక్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మంగళవారం సాయంత్రం SBI బ్యాంక్‌లో కరెంట్ సప్లై కాకపోవడంతో సిబ్బంది జనరేటర్‌ను ఆన్ చేశారు. ఒక్కసారిగా పేలుడు సంభవించి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. బ్యాంక్ అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎండ తీవ్రత కారణంగా జనరేటర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంలో ఊపిరి పీల్చుకున్నారు.

అంతరిక్షమే కాదు  స్పేస్ వార్ లోకీ ఎలన్ మస్క్ దూకుడు!
World· 9 Jun 2026

అంతరిక్షమే కాదు స్పేస్ వార్ లోకీ ఎలన్ మస్క్ దూకుడు!

స్పేస్ ఎక్స్ కేవలం వాణిజ్య సంస్థగానే కాకుండా అమెరికా రక్షణ వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఎదిగింది. అమెరికా సైనిక, నిఘా అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించడంలో ఎలోన్ మస్క్ సంస్థ ఇప్పుడు గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పెంటగాన్ నమ్మకమైన భాగస్వామిగా మారి, దేశ భద్రత మరియు అంతరిక్ష యుద్ధ వ్యూహాలలో స్పేస్ ఎక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాక్ లాంటి దేశాలపై సామ్రాజ్యవాద యుద్ధాలకు ఇక సహకరిస్తుందన్న మాట.

నడిరోడ్డుపై ఈ లీడర్‌కు గుండు గీసి, చెప్పుల దండతో ఊరేగింపు!▶
News· 9 Jun 2026

నడిరోడ్డుపై ఈ లీడర్‌కు గుండు గీసి, చెప్పుల దండతో ఊరేగింపు!

పశ్చిమ బెంగాల్‌లోని నౌదా గ్రామంలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. తమను టార్చర్ పెడుతున్నారంటూ కోపంతో ఉన్న స్థానిక ప్రజలు. ఒక TMC లీడర్‌పై దారుణంగా రివెంజ్ తీర్చుకున్నారు. అతని తలకు నల్ల రంగు పూసి, గుండు గీసి, మెడలో చెప్పుల దండ వేసి మరీ నడిరోడ్డుపై ఊరేగించారు. గతంలో తమను నరకయాతన పెట్టారనే కక్షతోనే ప్రజలంతా కలిసి ఈ పని చేశారంట. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

CM విజయ్ లో మరో కోణం!▶
Politics· 9 Jun 2026

CM విజయ్ లో మరో కోణం!

అత్యాచారం చేసే వాళ్లకు తమిళనాడు CM విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "ఇప్పటివరకు నేను చాలా సాఫ్ట్‌గా మాట్లాడాను.. కానీ ఇకపై అలా ఉండను" అంటూ ఆయన పబ్లిక్‌గానే ఫైర్ అయ్యారు. ఉమెన్ సేఫ్టీ కి హాని చేయాలని చూస్తే అస్సలు వదిలేదే లేదన్నట్టుగా CM విజయ్ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆయన రఫ్ అండ్ రూడ్ డెసిషన్స్‌కి నెటిజన్లు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

రాజమహేంద్రవరం ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
Crime· 9 Jun 2026

రాజమహేంద్రవరం ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

AP: రాజమహేంద్రవరంలోని లాలా చెరువుకు సమీపంలో ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీ షాపింగ్ మాల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్లార్‌లో నిల్వ ఉంచిన కాటన్‌కు మంటలు అంటుకోవడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. సెల్లార్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన టైమ్‌లో లోపల ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న CM విజయ్!▶
Politics· 9 Jun 2026

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న CM విజయ్!

తమిళనాడు CM విజయ్ 'సింగప్పెణ్ స్పెషల్ కమాండో ఫోర్స్' గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ఉమెన్ కమాండో ఫోర్స్ అనేది ఓన్లీ ఎలక్షన్స్ కోసం అనౌన్స్ చేసిన స్కీమ్ కాదని. ఇది తన గుండెల్లోంచి వచ్చిన ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఎలక్షన్ టైమ్‌లో తాము ఇచ్చిన ప్రతి ప్రామిస్‌ని కచ్చితంగా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామని CM విజయ్ ప్రామిస్ చేశారు. మహిళల రక్షణ కోసం ఆయన చూపించిన ఈ డెడికేషన్‌పై నెటిజన్లు ఫుల్ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.

ఏడు లక్షల మంది అపరిచితులు కాపాడిన ఒక ప్రాణం!
World· 9 Jun 2026

ఏడు లక్షల మంది అపరిచితులు కాపాడిన ఒక ప్రాణం!

సౌదీలో 20 ఏళ్లుగా ఉరి భయం ఎదుర్కొంటున్న కేరళ వాసి అబ్దుల్ రహీమ్‌కు లైఫ్ లైన్ దొరికింది. 7 లక్షల మంది కేరళీయులు పిగ్గీ బ్యాంకుల నుంచి బంగారు గొలుసుల వరకు విరాళాలుగా సేకరించి ₹47 కోట్ల బ్లడ్ మనీని పోగేశారు. యజమాని కుటుంబం క్షమించడంతో ఆగస్టు 7న రహీమ్ స్వదేశం చేరాడు. మానవత్వం గెలిచింది! ఇంతకీ రహీమ్ చేసిన నేరం ఏంటంటే దివ్యాంగుడైన యజమాని కొడుకు కి కేర్ టేకర్ గా ఉండగా ఆ పిల్లాడు అల్లరి చేస్తూ కారు స్టీరింగ్ తాకడంతో యాక్సిడెంట్ అయి ఆ బాలుడు చనిపోయాడు. సౌదీ కోర్టులు దీన్ని యాక్సిడెంట్‌గా గుర్తించినా, హత్య కింద 2012లో మరణశిక్ష విధించాయి.

CM విజయ్‌ను కలిసిన హీరోయిన్  స్నేహ..
Cinema· 9 Jun 2026

CM విజయ్‌ను కలిసిన హీరోయిన్ స్నేహ..

కోలీవుడ్ స్టార్ కపుల్ యాక్ట్రెస్ స్నేహ, యాక్టర్ ప్రసన్న తమ ఫ్యామిలీతో కలిసి తమిళనాడు CM విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. CM ఆఫీస్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో వాళ్లు విజయ్‌కి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. చాలా రోజుల తర్వాత వీళ్లంతా ఇలా కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇటు ఫ్యాన్స్, అటు నెటిజన్లు ఈ పిక్స్‌ చూసి లైకులు కొడుతున్నారు.

ఎండిపోయిన చెరువులో  5K  RUN
TG· 9 Jun 2026

ఎండిపోయిన చెరువులో 5K RUN

TG: చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపుపై అవేర్నేస్ కల్పించేందుకు ధాత్రి NGO సంస్థ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో ఎండిపోయిన పెద్దచెరువు అడుగున 5K Run Below The Lake పేరుతో రన్ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. చెరువు మధ్యలో నీటి బిందువు ఆకారంలో నిల్చొని "చెరువులను కాపాడుకుందాం-భూగర్భ జలాలను పెంచుకుందాం" అనే సందేశంతో అవగాహన కల్పించారు. ధాత్రి NGO వ్యవస్థాపకులు వెంకట్ మాట్లాడుతూ.. చెరువులు ఎండిపోతే బోర్లు ఎండిపోతాయని, బోర్లు ఎండిపోతే భవిష్యత్ తరాలకే కాదు ప్రస్తుత తరానికే ముప్పు తప్పదన్నారు.

తమిళనాడులో CM విజయ్ సరికొత్త ప్లాన్..▶
Politics· 9 Jun 2026

తమిళనాడులో CM విజయ్ సరికొత్త ప్లాన్..

తమిళనాడులో CM విజయ్ ఒక పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఉమెన్ సేఫ్టీ అండ్ ఎంపవర్‌మెంట్‌ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన 'సింగప్పణ్ స్పెషల్ కమాండో ఫోర్స్' విజన్‌ను ఆయన ఒక ఈవెంట్‌లో అఫీషియల్‌గా లాంచ్ చేశారు. ఉమెన్ సేఫ్టీ కోసం ఈ కమాండో ఫోర్స్ చాలా యాక్టివ్‌గా అండ్ సీరియస్‌గా వర్క్ చేయబోతోంది. CM విజయ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్
Crime· 9 Jun 2026

పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సూసైడ్

TG: పాలమూరు యూనివర్సిటీలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం వెల్జర్ల విలేజ్‌కు చెందిన కార్తీక్ (23) పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలు సోమవారం ప్రారంభం కాగా.. రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కు వచ్చాడు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన ఫ్రెండ్స్ కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.

వేల పోస్టులకు లక్షల్లో క్యాండిడేట్స్,.. యూపీలో  మతిపోయే సీన్▶
India· 9 Jun 2026

వేల పోస్టులకు లక్షల్లో క్యాండిడేట్స్,.. యూపీలో మతిపోయే సీన్

రైలు కిటికీల్లోంచి లోపలకి దూరిపోతున్న వీళ్లంతా ఎవరా అని సర్ ప్రైజ్ అవుతున్నారా? వారంతా యూపీలో కానిస్టేబుల్ పోస్టులకు అప్లయ్ చేసుకున్ననిరుద్యోగులు. రాత పరీక్ష ఉందని అనౌన్స్ మెంట్ రావడంతో అందరూ దానికోసం ప్రయాణమవుతున్నారు. మీరు చూస్తున్నది లక్నో లోని చార్ బాగ్ రైల్వే స్టేషన్. మొత్తం 32,679 పోస్టుల కోసం ఏకంగా 28 లక్షల 90వేల మంది పోటీ పడుతున్నారు. దాంతో స్టేషన్ లో రద్దీ పెరిగి , స్థలం లేకపోవడంతో ఎమర్జెన్సీ విండోస్ నుంచి కూడా లోపలికి దూరిపోతున్నారు. యూత్ లో ఉద్యోగాల కోసం ఇంత క్రేజ్ ఉందా?

The Clear Cut News Headlines- ముఖ్యాంశాలు▶
Politics· 9 Jun 2026

The Clear Cut News Headlines- ముఖ్యాంశాలు

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. కంట్రోల్‌రూమ్ ఏర్పాటు * మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం * గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ * వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై లోకేష్ ఫైర్! * వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్! * స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌ ముట్టడి.. TRS నాయకుల అరెస్ట్

న్యూ ఏజ్ కోర్సులపై  యువత క్రేజ్ !
Education· 9 Jun 2026

న్యూ ఏజ్ కోర్సులపై యువత క్రేజ్ !

కొత్త కోర్సుల వైపు విద్యార్థుల మొగ్గు ప్రస్తుత 'మిషన్ అడ్మిషన్' సీజన్‌లో విద్యార్థులు తమ కెరీర్ ప్లాన్స్‌ను మార్చుకుంటున్నారు. టైమ్స్ సిటీ (Times City) కథనం ప్రకారం.. సాంప్రదాయ కోర్సుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కొత్త తరం న్యూ-ఏజ్ కోర్సుల వైపే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, గ్లోబల్ డిమాండ్ ఎక్కువగా ఉండే వోకేషనల్, అలైడ్ సైన్సెస్, మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకుంటూ విద్యార్థులు తమ కెరీర్ రూట్‌ను మార్చుకుంటున్నారు.