విజయ్ సపోర్ట్ కు నో చెప్పిన కమ్యూనిస్టులు !

టీవీకే అధినేత విజయ్ ప్రమాణస్వీకారం రద్దయ్యింది. తిరిగి ఆదేశాలు ఇచ్చే వరకూ రిసార్టు లోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. రేపు ఉదయం 11.30కి ఆయన ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉన్నా గవర్నర్ మెజారిటీ లేదని రిజెక్ట్ చేశారు. కాంగ్రెస్ మద్దతుతో కలిపి విజయ్ కు 112 మంది మాత్రమే ఉన్నారు. మేజిక్ ఫిగర్ కు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరమవుతారు.అన్నా డీఎంకే పళని స్వామి మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. లెఫ్ట్ పార్టీలు తాము సపోర్ట్ చేయలేమని చేతులెత్తేశాయి. రేపు ప్రమాణ స్వీకారంలోగా ఏదో రకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.



