కాషాయం కట్టుకున్న భారత్.. తగ్గిపోతున్న ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య

పశ్చిమ బెంగాల్, అసోంలో విజయంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే దేశంలో 22 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. దీంతో ఇండియన్ పొలిటికల్ ఫేస్ మారిపోతోంది. అసెంబ్లీలలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోవడం కనిపిస్తోంది. 2013లో ముస్లిం ఎమ్మెల్యేలు 339 మంది ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 282కి పడిపోయింది. యూపీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 63 నుండి 31కి తగ్గితే పశ్చిమ బెంగాల్‌లో 59 నుండి 37కి, బీహార్19 నుండి 11కి , రాజస్థాన్11 నుండి 6కి తగ్గింది. మొత్తం ఏడు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిమ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు.



