సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. బెంగాల్‌లో కొనసాగుతున్న హింస

పశ్చిమ బెంగాల్ భగ్గుమంటోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణలు తారా స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థి రేసులో ముందున్న సువేందు అధికారి PA చంద్రనాథ్ రథ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బుధవారం రాత్రి మధ్యమ్‌గ్రామ్ సమీపంలో కారులో వెళ్తుండగా బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి ఆయన్ని కాల్చి చంపారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. టీఎంసీ ప్రీ ప్లాన్డ్ గా తన పీఏని చంపేసిందని సువేందు అధికారి ఆరోపించారు.



