Latest

బహుజన రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు
Local· 24 Aug 2026

బహుజన రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు

AP: జనాభాలో బహుజనులు అధికంగా ఉన్నా.. రాజకీయ అధికారం మాత్రం కొద్దిమంది ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉందని, ఈ పరిస్థితి మారాలంటే బహుజన రాజ్యాధికారం సాధించాల్సిందేనని ఏఐబీఎస్పీ నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు‌లో చంద్రప్ప అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆల్‌ ఇండియా బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా గౌరవ అధ్యక్షులు తరిగొండ మణి మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేదన్నారు.

వివాహ వేడుక నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం
Local· 24 Aug 2026

వివాహ వేడుక నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం

TG: పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహానికి హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా నక్కలపల్లి స్టేజ్ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ప్రమాదంలో పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాముల గ్రామానికి చెందిన మద్దటి పెద్ద చిన్నయ్య (68) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడగా, స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పండుగ వేళ ధరల షాక్.. సామాన్యుడికి తలనొప్పి!
Current Affairs· 24 Aug 2026

పండుగ వేళ ధరల షాక్.. సామాన్యుడికి తలనొప్పి!

నిత్యావసర రేట్లు సామాన్యులను కలవరపెడుతున్నాయి. బియ్యం ధరలు భారీగా పెరిగాయి. సన్న బియ్యం కిలో రూ.63 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. షుగర్ రకాన్ని బట్టి కిలో రూ. 42-44 నుంచి రూ. 60-65 వరకు పెరిగింది. పప్పులు, శనగలు, వంట నూనెల ధరలూ పెరిగాయి. కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. దీనికితోడు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా భారంగా మారాయి. ధరల పెరగడానికి కారణాలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పండుగలు, శుభకార్యాల సమయంలో కామన్ మ్యాన్‌కు పెరిగిన రేట్లు తలనొప్పిగా మారాయి.

డ్రైవింగ్ చేస్తూ ఈ తప్పులు చేస్తే చర్యలే!
Local· 24 Aug 2026

డ్రైవింగ్ చేస్తూ ఈ తప్పులు చేస్తే చర్యలే!

AP: హెల్మెట్ లేకుండా బయటకు వస్తే ఇక కష్టమే.. కోరుకొండలో పోలీసులు కఠిన తనిఖీలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నార్త్‌జోన్ డీఎస్పీ జీవన సమక్షంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని డీఎస్పీ జీవన సూచించారు.

🎙️ రాజమౌళి AIకి నో.. 1,500 గొంతులు ఎందుకు?
Entertainment· 24 Aug 2026

🎙️ రాజమౌళి AIకి నో.. 1,500 గొంతులు ఎందుకు?

ఒక్కసారి ఊహించండి.. ఒక సినిమాను 50 భాషల్లో విడుదల చేయాలంటే ఎంతమంది గొంతులు కావాలి? అదే ఇప్పుడు రాజమౌళి టీమ్ ముందు ఉన్న పెద్ద పని. మహేశ్ బాబు ‘Varanasi’ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీగా డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట AI వాయిస్‌లతో పని సులభం చేయాలనుకున్నా.. ఇప్పుడు నిజమైన డబ్బింగ్ ఆర్టిస్టుల వైపు మొగ్గినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఇందుకోసం దాదాపు 1,500 మంది ఆర్టిస్టులను ఆడిషన్ చేయనున్నారట. కారణం సింపుల్.. డైలాగ్ అనువదిస్తే సరిపోదు, ఎమోషన్ కూడా అదే స్థాయిలో వినిపించాలి.

చండీగఢ్‌లో టెర్రరిస్టులు కలకలం.. ముగ్గురు అరెస్ట్
National· 24 Aug 2026

చండీగఢ్‌లో టెర్రరిస్టులు కలకలం.. ముగ్గురు అరెస్ట్

నిన్న అర్ధరాత్రి చండీగఢ్‌లో పోలీసులు భారీ టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేశారు. సెక్టార్-43 ISBT వెనుక ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద అనుమానిత IED, పేలుడు పదార్థాలు, గన్ రికవరీ చేసుకున్నారు. దాదాపు 5 కిలోల జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్, పవర్ సోర్స్, వైర్లు వారి దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఐదు బుల్లెట్లు కూడా రికవరీ చేశారు. నిందితులకు విదేశీ హ్యాండ్లర్‌తో లింక్స్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

గోసంగి సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు
Local· 24 Aug 2026

గోసంగి సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటు

TG: గోసంగి సంఘం నూతన జిల్లా కార్యవర్గం కొలువుదీరింది.. అధ్యక్షుడిగా ఈర్నాల వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో గోసంగి సంఘం ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఈర్నాల వినోద్ కుమార్ మాట్లాడుతూ.. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి గోసంగి జాతి విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఓనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
Local· 24 Aug 2026

ఓనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

TG: మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గం విభిన్న సంస్కృతులకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్‌లోని ఎస్‌ఎన్‌ గార్డెన్స్‌లో కేరళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పండుగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి వర్గం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

తులసినాథం నాయుడుకు ప్రతిష్ఠాత్మక గిడుగు పురస్కారం
Local· 24 Aug 2026

తులసినాథం నాయుడుకు ప్రతిష్ఠాత్మక గిడుగు పురస్కారం

AP: తెలుగు భాషకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పి. తులసినాథం నాయుడుకు ప్రతిష్ఠాత్మక గిడుగు సేవా పురస్కారం లభించింది. విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయ ఆడిటోరియంలో నిర్వహించిన మల్లెతీగ సృజనోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు ముని మనవడు గిడుగు వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా తులసినాథం నాయుడు పురస్కారం స్వీకరించారు. తెలుగు భాష, సాహిత్య రంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.

మహారాష్ట్రలో దారుణం.. మంటల్లో ముగ్గురు పసికందులు
National· 24 Aug 2026

మహారాష్ట్రలో దారుణం.. మంటల్లో ముగ్గురు పసికందులు

మహారాష్ట్రలోని అమరావతి డిస్ట్రిక్ట్ ఉమెన్స్ హాస్పిటల్‌లో దారుణ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం 3:30 గం. సమయంలో NICUలో మంటలు చెలరేగాయి. వెంటిలేటర్‌ బ్లాస్ట్ అవ్వడంతో ముగ్గురు పసికందులు మృతి చెందారు. డాక్టర్లు, నర్సులు వెంటనే శిశువులను (పసికందులు) బయటకు తీసుకెళ్లారు. ఘటన సమయంలో 39 మంది నవజాత శిశువులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరుగురిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ప్రమాదంపై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ముట్టుకుంటే 100 కోట్లు.. ఇదేం అవినీతి: ఆకునూరి
TG· 24 Aug 2026

ముట్టుకుంటే 100 కోట్లు.. ఇదేం అవినీతి: ఆకునూరి

TG: అధికారులే రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెడుతుంటే.. ఇక రాజకీయ నాయకుల <a href="https://www.theclearcutnews.com/n/MrptHW9">అవినీతి</a> ఏ స్థాయిలో ఉంటుందో ఊహించగలమా? అంటూ రిటైర్డ్ IAS ఆకునూరి మురళీ ప్రశ్నించారు. తెలంగాణలో వెలుగులోకి వస్తున్న అక్రమాస్తుల వ్యవహారంపై ఆయన తన <a href="https://x.com/Murali_IASretd/status/2091390063963967690?s=20">ఎక్స్</a> వేదికగా స్పందించారు. దొరికిన అవినీతి అధికారులే ఇంత భారీగా ఆస్తులు కూడబెట్టారంటే.. దర్యాప్తు జరగని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అవినీతిని అరికట్టేందుకు స్వచ్ఛ రాజకీయాలు, రాజకీయ ప్రక్షాళన, కఠిన శిక్షలు, స్వతంత్ర అవినీతి నిరోధక సంస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

1995 నుంచి పెన్షన్ అదే.. రిటైరీల ఆవేదన
TG· 24 Aug 2026

1995 నుంచి పెన్షన్ అదే.. రిటైరీల ఆవేదన

TG: మూడు దశాబ్దాలుగా పెన్షన్ సవరణ లేకపోవడంతో బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పెన్షన్‌ను అప్‌డేట్ చేయాలని ఆలిండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సి.జైన్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటలో ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ అధికారులు హాజరయ్యారు.

AI ఉద్యోగాలపై Singapore కొత్త ప్లాన్!
Technology· 24 Aug 2026

AI ఉద్యోగాలపై Singapore కొత్త ప్లాన్!

AI వచ్చాక “నా ఉద్యోగం ఉంటుందా?” అనే భయం చాలామందిలో పెరుగుతోంది. 🤖 కానీ సింగపూర్ మాత్రం ఉద్యోగాలు పోయే వరకు ఆగకుండా.. ముందే స్కిల్ మార్చే ప్లాన్‌తో వెళ్తోంది. ప్రభుత్వం, కంపెనీలు, కార్మిక సంఘాలు కలిసి AI వల్ల ఉద్యోగాల్లో వచ్చే మార్పులను ఎదుర్కొనేందుకు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఉద్యోగాలు పూర్తిగా పోవడం కంటే, పనులు మారి కొత్త బాధ్యతలు రావడంపై ఫోకస్ చేస్తున్నారు. అందుకే కార్మికులకు AI, కొత్త స్కిల్స్ నేర్పించి, అవసరమైతే మరో ఉద్యోగానికి మారేందుకు ట్రైనింగ్, కెరీర్ సపోర్ట్ ఇవ్వనున్నారు.

మళ్లీ భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు IMD అలర్ట్!
National· 24 Aug 2026

మళ్లీ భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు IMD అలర్ట్!

వర్షం కాస్త తగ్గిందనుకునేలోపే.. మళ్లీ కొన్ని రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. 🌧️ తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచొచ్చని IMD చెబుతోంది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ఇరాన్ రియాల్ ఎందుకు కుప్పకూలుతోంది?
International· 24 Aug 2026

ఇరాన్ రియాల్ ఎందుకు కుప్పకూలుతోంది?

డాలర్ రేటు ఒక్కసారిగా 20 లక్షల రియాల్స్ దాటితే.. అది కేవలం కరెన్సీ వార్త కాదు, దేశ ఆర్థిక పరిస్థితికి పెద్ద సిగ్నల్. ఇరాన్‌లో ఓపెన్ మార్కెట్‌లో డాలర్ విలువ రికార్డు స్థాయిలో 20 లక్షల రియాల్స్ దాటింది. అంటే ఒక డాలర్ కొనాలంటే గతంతో పోలిస్తే భారీగా ఎక్కువ రియాల్స్ ఇవ్వాల్సి వస్తోంది. అమెరికా కొత్తగా ప్రకటించబోయే కఠినమైన ఆంక్షల భయం, ఇప్పటికే ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే దిగుమతుల ఖర్చు, వస్తువుల ధరలు, ప్రజల జీవన వ్యయంపై కూడా మరింత ఒత్తిడి పడొచ్చు.

లక్షల్లో జీతం.. కోట్లలో ఆస్తులు
TG· 24 Aug 2026

లక్షల్లో జీతం.. కోట్లలో ఆస్తులు

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొందరు అధికారుల అక్రమాస్తులపై ACB దర్యాప్తులు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. అధికారిక రికార్డుల ప్రకారం, భారీ జీతాలు పొందుతున్నప్పటికీ కొందరు అధికారులు గత 12ఏళ్లలో వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న అధికారులు 25 మంది ఉన్నారు. కాళేశ్వరం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్ శాఖలకు చెందిన నలుగురు ఇంజినీర్ల ఆస్తుల విలువే రూ.1,000 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.

మహిళల కోటాపై BJP–Congress మధ్య మళ్లీ ఫైట్?
National· 24 Aug 2026

మహిళల కోటాపై BJP–Congress మధ్య మళ్లీ ఫైట్?

మహిళలకు 33% రిజర్వేషన్‌పై అసలు గొడవ ఇవ్వాలా వద్దా అనే దానిపై కాదు.. ఎప్పటి నుంచి అమలు చేయాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రభుత్వం డీలిమిటేషన్‌తో దీనిని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా, కాంగ్రెస్ మాత్రం మహిళల కోటాను ఆలస్యం చేయకుండా త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో BJP–Congress మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. ఈ రిజర్వేషన్ అమలైతే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. అందుకే ఇది కేవలం రాజకీయ ఫైట్ కాదు.. మహిళల ప్రాతినిధ్యం ఎప్పుడన్న ప్రశ్న కూడా.

హక్కుల కోసం పోరాడాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
TG· 24 Aug 2026

హక్కుల కోసం పోరాడాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

TG: గొంతెత్తి ప్రశ్నించి పోరాడినప్పుడే రాజ్యాంగం అందించే హక్కులు, న్యాయం ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీడియా కాన్‌క్లేవ్‌లో ఏ స్ట్రాంగర్ వాయిస్.. ఫర్ స్ట్రాంగ్ నేషన్, జర్నలిస్టుల రక్షణ అంశాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, అరెస్టులకు ప్రయత్నించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పాత్రికేయులు ఐక్యంగా ఉండి తమ హక్కుల పరిరక్షణకు పోరాడాలని సూచించారు.

యువత కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: యోగేంద్ర యాదవ్
Gen Z· 24 Aug 2026

యువత కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: యోగేంద్ర యాదవ్

AP: దేశ సమస్యలకు పరిష్కారం చూపే శక్తి యువతలో ఉందని, వారిని ప్రోత్సహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా కృషి చేయాలని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బీపీ మండల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రాజకీయ రంగంలో యువశక్తి-జెన్ జీ’ అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి వ్యవస్థల్లోని లోపాలే కారణమని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.

SLBCపై మంత్రి కోమటిరెడ్డి బిగ్ అప్డేట్
TG· 24 Aug 2026

SLBCపై మంత్రి కోమటిరెడ్డి బిగ్ అప్డేట్

TG: SLBC (ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమ కాల్వ) ప్రాజెక్టు పనులను 2028 నాటికి పూర్తి చేసి నల్గొండ రైతుల కలను సాకారం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. నల్గొండ క్లబ్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ మేరకు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఎస్ఎల్బీసీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నల్గొండ అభివృద్ధికి రూ.900 కోట్లతో పలు పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

విద్యార్థుల జంతర్ మంతర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ🎥
Gen Z· 23 Aug 2026

విద్యార్థుల జంతర్ మంతర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ🎥

ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన యువత ఆందోళనపై త్వరలో డాక్యుమెంటరీ రాబోతోంది. జర్నలిస్ట్ అతుల్ హోవలే దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఈ ఉద్యమాన్ని రికార్డు చేశారు. బేగంపురా ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆందోళన, సోనమ్ వాంగ్చుక్ నిరాహారదీక్ష నుండి పార్లమెంట్ మార్చ్ వరకు.. వీధుల్లోనే వారాల తరబడి ఉన్న విద్యార్థుల ఉద్యమం రియల్ స్టోరీని ఈ డాక్యుమెంటరీలో చూపిస్తాం అని డైరెక్టర్ ప్రకటించారు.