Latest

మళ్లీ భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు IMD అలర్ట్!
National· 24 Aug 2026

మళ్లీ భారీ వర్షాలు.. ఈ రాష్ట్రాలకు IMD అలర్ట్!

వర్షం కాస్త తగ్గిందనుకునేలోపే.. మళ్లీ కొన్ని రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. 🌧️ తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచొచ్చని IMD చెబుతోంది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ఇరాన్ రియాల్ ఎందుకు కుప్పకూలుతోంది?
International· 24 Aug 2026

ఇరాన్ రియాల్ ఎందుకు కుప్పకూలుతోంది?

డాలర్ రేటు ఒక్కసారిగా 20 లక్షల రియాల్స్ దాటితే.. అది కేవలం కరెన్సీ వార్త కాదు, దేశ ఆర్థిక పరిస్థితికి పెద్ద సిగ్నల్. ఇరాన్‌లో ఓపెన్ మార్కెట్‌లో డాలర్ విలువ రికార్డు స్థాయిలో 20 లక్షల రియాల్స్ దాటింది. అంటే ఒక డాలర్ కొనాలంటే గతంతో పోలిస్తే భారీగా ఎక్కువ రియాల్స్ ఇవ్వాల్సి వస్తోంది. అమెరికా కొత్తగా ప్రకటించబోయే కఠినమైన ఆంక్షల భయం, ఇప్పటికే ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే దిగుమతుల ఖర్చు, వస్తువుల ధరలు, ప్రజల జీవన వ్యయంపై కూడా మరింత ఒత్తిడి పడొచ్చు.

లక్షల్లో జీతం.. కోట్లలో ఆస్తులు
TG· 24 Aug 2026

లక్షల్లో జీతం.. కోట్లలో ఆస్తులు

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొందరు అధికారుల అక్రమాస్తులపై ACB దర్యాప్తులు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. అధికారిక రికార్డుల ప్రకారం, భారీ జీతాలు పొందుతున్నప్పటికీ కొందరు అధికారులు గత 12ఏళ్లలో వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న అధికారులు 25 మంది ఉన్నారు. కాళేశ్వరం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్ శాఖలకు చెందిన నలుగురు ఇంజినీర్ల ఆస్తుల విలువే రూ.1,000 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.

మహిళల కోటాపై BJP–Congress మధ్య మళ్లీ ఫైట్?
National· 24 Aug 2026

మహిళల కోటాపై BJP–Congress మధ్య మళ్లీ ఫైట్?

మహిళలకు 33% రిజర్వేషన్‌పై అసలు గొడవ ఇవ్వాలా వద్దా అనే దానిపై కాదు.. ఎప్పటి నుంచి అమలు చేయాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రభుత్వం డీలిమిటేషన్‌తో దీనిని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా, కాంగ్రెస్ మాత్రం మహిళల కోటాను ఆలస్యం చేయకుండా త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో BJP–Congress మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. ఈ రిజర్వేషన్ అమలైతే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. అందుకే ఇది కేవలం రాజకీయ ఫైట్ కాదు.. మహిళల ప్రాతినిధ్యం ఎప్పుడన్న ప్రశ్న కూడా.

హక్కుల కోసం పోరాడాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
TG· 24 Aug 2026

హక్కుల కోసం పోరాడాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి

TG: గొంతెత్తి ప్రశ్నించి పోరాడినప్పుడే రాజ్యాంగం అందించే హక్కులు, న్యాయం ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీడియా కాన్‌క్లేవ్‌లో ఏ స్ట్రాంగర్ వాయిస్.. ఫర్ స్ట్రాంగ్ నేషన్, జర్నలిస్టుల రక్షణ అంశాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, అరెస్టులకు ప్రయత్నించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పాత్రికేయులు ఐక్యంగా ఉండి తమ హక్కుల పరిరక్షణకు పోరాడాలని సూచించారు.

యువత కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: యోగేంద్ర యాదవ్
Gen Z· 24 Aug 2026

యువత కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: యోగేంద్ర యాదవ్

AP: దేశ సమస్యలకు పరిష్కారం చూపే శక్తి యువతలో ఉందని, వారిని ప్రోత్సహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా కృషి చేయాలని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బీపీ మండల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రాజకీయ రంగంలో యువశక్తి-జెన్ జీ’ అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. యువతలో పెరుగుతున్న అసంతృప్తికి వ్యవస్థల్లోని లోపాలే కారణమని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు.

SLBCపై మంత్రి కోమటిరెడ్డి బిగ్ అప్డేట్
TG· 24 Aug 2026

SLBCపై మంత్రి కోమటిరెడ్డి బిగ్ అప్డేట్

TG: SLBC (ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమ కాల్వ) ప్రాజెక్టు పనులను 2028 నాటికి పూర్తి చేసి నల్గొండ రైతుల కలను సాకారం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. నల్గొండ క్లబ్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ మేరకు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ఎస్ఎల్బీసీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నల్గొండ అభివృద్ధికి రూ.900 కోట్లతో పలు పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

విద్యార్థుల జంతర్ మంతర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ🎥
Gen Z· 23 Aug 2026

విద్యార్థుల జంతర్ మంతర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ🎥

ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన యువత ఆందోళనపై త్వరలో డాక్యుమెంటరీ రాబోతోంది. జర్నలిస్ట్ అతుల్ హోవలే దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఈ ఉద్యమాన్ని రికార్డు చేశారు. బేగంపురా ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. ఆందోళన, సోనమ్ వాంగ్చుక్ నిరాహారదీక్ష నుండి పార్లమెంట్ మార్చ్ వరకు.. వీధుల్లోనే వారాల తరబడి ఉన్న విద్యార్థుల ఉద్యమం రియల్ స్టోరీని ఈ డాక్యుమెంటరీలో చూపిస్తాం అని డైరెక్టర్ ప్రకటించారు.

కోస్తా అదానీకేనా? సీపీఎం నో!
Local· 23 Aug 2026

కోస్తా అదానీకేనా? సీపీఎం నో!

శ్రీకాకుళం కోస్తా ఇక అదానీ సొంతమా? సీపీఎం లీడర్ జిల్లా సెక్రటరీ డి.గోవిందరావు షాకింగ్ క్లారిటీ ఇచ్చారు – ఈ డీల్ క్యాన్సిల్ చేయాలి! Rare Earth తవ్వకాల పేరుతో తీరం ఇస్తే మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడతాయి, ఉప్పునీరు పంటల్లోకి వచ్చి రైతులకు నష్టం, పర్యావరణానికి తీవ్ర ముప్పు. టెక్కలి, సంతబొమ్మాళిలో భూసేకరణ ఆపేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని సీపీఎం వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇంకా ఎంత వరకు సాగుతుందో చూడాలి!

గోదావరిఖనిలో కరెంటు బంద్!
Local· 23 Aug 2026

గోదావరిఖనిలో కరెంటు బంద్!

గోదావరిఖని లక్ష్మీ నగర్, రాహుల్ హాస్పిటల్, పాత పంచాయతీ ఆఫీసు ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు కరెంటు ఆగిపోతుంది. కారణం – మరమ్మత్తు పనులు. ట్రాన్స్కో ఈస్ట్ ఏఈ జమిల్ పాషా ఇదే విషయం క్లియర్ చేశారు. ఇంట్లో ల్యాప్టాప్స్, ఫోన్స్, ఇన్వర్టర్స్ బ్యాకప్ ఇప్పుడే చేసుకోండి.. లేదంటే 6 గంటల పాటు 'నో చార్జ్' టెన్షన్ మూడుతుంది. అధికారులు వినియోగదారుల సహకారం కోరుతున్నారు. ఈ సమయంలో ఆఫ్లైన్ పనులు పూర్తి చేసేసుకోవడమే స్మార్ట్ ట్రిక్!

BREAKING: ఆటోల బంద్ లేదు..చర్చలు సఫలం
Current Affairs· 23 Aug 2026

BREAKING: ఆటోల బంద్ లేదు..చర్చలు సఫలం

TG: ఆటో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి చేయాలనుకున్న సమ్మె లేనట్టు ప్రకటించారు. ఈ మేరకు లెటర్ రిలీజ్ చేశారు. ఆటో కార్మికుల డిమాండ్స్‌కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటో కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి హామీ ఇచ్చారు.

కుల వివక్షను అంతం చేయాలి
Local· 23 Aug 2026

కుల వివక్షను అంతం చేయాలి

AP : చిత్తూరు జిల్లాలో కుల వివక్షను అరికట్టి సామాజిక న్యాయం అందించాలని పలమనేరులో నాయకులు ఓబుళరాజు, ఈశ్వర్ డిమాండ్ చేశారు. 'సామాజిక శంఖారావం' కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దళిత కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటికలు కల్పించాలని కోరారు. భూమిలేని దళిత కుటుంబాలకు రెండెకరాల భూమి ఇవ్వాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలకు రక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

MRPS మండల సమావేశం
Local· 23 Aug 2026

MRPS మండల సమావేశం

TG : ఈ నెల 24న మధ్యాహ్నం 2 గంటలకు రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల MRPS సమావేశం జరుగుతుంది. స్థానిక GM పటేల్ మినీ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ ఉంటుంది. గ్రామాల్లో కొత్త కమిటీల ఏర్పాటుపై ఇందులో చర్చిస్తారు. దళితులపై జరుగుతున్న దాడులు, సమస్యలపై కూడా మాట్లాడుతారు. అన్ని గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు ఈ సమావేశానికి తప్పకుండా రావాలని MRPS నాయకులు కోరారు.

చెడు మార్గంలో యువత
Local· 23 Aug 2026

చెడు మార్గంలో యువత

AP : గుంటూరు జిల్లా మంగళగిరిలో DYFI 14వ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడారు. డ్రగ్స్ మాఫియా వల్లే నేటి యువత చెడు మార్గంలోకి వెళ్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, నిరుద్యోగం కూడా రోజురోజుకూ పెరిగిపోతోందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు పోరాడినట్లే, నేడు కూడా స్వేచ్ఛ కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

అమ్మనాన్నలను బాగా చూసుకుంటాం
Local· 23 Aug 2026

అమ్మనాన్నలను బాగా చూసుకుంటాం

TG : జగిత్యాల జిల్లాలో అనాథలుగా మారిన వృద్ధ తల్లిదండ్రుల ఫిర్యాదులపై కౌన్సిలింగ్ నిర్వహించారు. సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు వృద్ధుల సంరక్షణ చట్టం గురించి చెప్పారు. దీంతో కొడుకులు, కూతుళ్లు మారారు. తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని బాండ్ పేపర్లు రాసిచ్చి, తమతో పాటు ఇంటికి తీసుకెళ్లారు.

ఒకే వేదికపై 200 మంది కళాకారులు
Local· 23 Aug 2026

ఒకే వేదికపై 200 మంది కళాకారులు

TG : పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలంలో ప్రపంచ జానపద కళల దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో జానపద వేడుకలు ఘనంగా జరిగాయి. కృషి కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 200 మంది జానపద, శాస్త్రీయ కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కళాకారుల కోసం ఒక ఆడిటోరియం నిర్మించాలని సంస్థ అధ్యక్షుడు రాజమౌళి పాలకులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు.

పదేళ్ల శ్రమకు ఫలితేది?
Local· 23 Aug 2026

పదేళ్ల శ్రమకు ఫలితేది?

TG : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న రేషన్ డీలర్లకు సరైన వేతనాలు చెల్లించాలని గిరిజన సంఘం నాయకుడు అప్పల నర్ష డిమాండ్ చేశారు. పాడేరు మోదకొండమ్మ ఆలయ కమ్యూనిటీ భవనంలో జరిగిన గిరిజన రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత చదువులు చదివి పరీక్షలు రాసి గెలిచినా, కేవలం కిలోకు రూపాయి కమిషన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా డీలర్లకు మంచి జీతం ఇవ్వాలని తెలిపారు.

SI, కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్
Local· 23 Aug 2026

SI, కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్

TG : ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఇచ్చే 60 రోజుల ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ముగిసింది. నలంద, శ్రీ చైతన్య, చావర సెంటర్లలో జరిగిన ఈ ఎగ్జామ్‌కు మొత్తం 3,446 మంది హాజరయ్యారు. టెస్టులో మంచి మార్కులు సాధించిన వారితో పాటు స్థానిక ఆదివాసీ యువతకు ప్రాధాన్యమిస్తూ 300 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇస్తారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కేంద్రాలను పరిశీలించి, 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వాడుకుని ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

కళాకారులను పట్టించుకోకపోతే పోరాటమే
Local· 23 Aug 2026

కళాకారులను పట్టించుకోకపోతే పోరాటమే

AP : కళలను, కళాకారులను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి నాయకులు చంద్రనాయక్, పెంచలయ్య అన్నారు. వినుకొండలో జరిగిన పల్నాడు జిల్లా సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వ సాయం లేక రాష్ట్రంలో నాటకాలు, కళల పరిస్థితి బాగా పాడైపోయిందని బాధపడ్డారు. ప్రత్యేక శాఖ ఉన్నా కళాకారులకు పైసా ఉపయోగం లేదని, బడ్జెట్‌లో డబ్బులు పెట్టకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని అడిగారు. ప్రజల కష్టాలను బయటపెడుతూ, కొత్త పాటలు, నాటకాల ద్వారా జనాల్లో మేల్కొలుపు తేవడానికి తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు.

70 ఏళ్ల వయసులో రైతుకు కొత్త జీవితం
Local· 23 Aug 2026

70 ఏళ్ల వయసులో రైతుకు కొత్త జీవితం

TG : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ సక్సెస్ అయింది. సిరిసేడు గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతుకు 16 ఏళ్ల క్రితం కాలేయానికి ఆపరేషన్ జరిగింది. అయితే మళ్లీ కాలేయంతో పాటు కడుపు భాగంలోకి వ్యాధి వ్యాపించింది. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో దాదాపు 8 ఆసుపత్రులు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోలేదు. చివరకు జమ్మికుంట హాస్పిటల్‌లో డాక్టర్ ను సంప్రదించారు. ఆయన పరీక్షించి కాలేయంలో 12 తిత్తులు ఉన్నట్లు గుర్తించారు. తన అనుభవంతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి రైతు ప్రాణాలను కాపాడారు.

చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు
Local· 23 Aug 2026

చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు

AP : నెల్లూరు జిల్లా కలిగిరి పెద్ద చెరువులో మట్టి మాఫియా విచ్చలవిడిగా తోడేస్తోంది. అధికారుల సహకారంతోనే హిటాచీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి రోజూ టన్నుల కొద్దీ మట్టిని అమ్ముకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. పొలం పనుల పేరుతో పర్మిషన్ తెచ్చుకుని, బయట వ్యాపారాలకు మట్టిని అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. చెరువును లోతుగా తవ్వేస్తుండటంతో అది పెద్ద గోతిలా మారిపోయింది. దీనివల్ల పశువులకి, జనాలకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను ఆపాలని ఊరి జనం కోరుతున్నారు.