← Back to news

నర్సంపేటలో బంద్‌కు బీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ

By ANUMALA NITHISH· 19 Aug 2026· Narsampet (Ct), Narsampet, Warangal

TG: వరంగల్‌ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా బుధవారం నర్సంపేట పట్టణంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. తెరిచి ఉన్న వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి బంద్‌ పాటించాలని వ్యాపారులను కోరారు. ర్యాలీ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ పట్టణంలో పర్యటించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

More in Local