సీనియర్ నటుడు నారాయణరావు కన్నుమూత

సీనియర్ నటుడు, నిర్మాత నారాయణరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌లో మరణించారు. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రజినీకాంత్‌తో కలిసి చదువుకున్న నారాయణరావు 'అంతులేని కథ', 'నాలాగా ఎందరో', 'ఒక ఊరి కథ', 'గణేష్' లాంటి అనేక సినిమాల్లో యాక్ట్ చేశారు. చిరంజీవి హీరోగా 'దేవాంతకుడు', 'యముడికి మొగుడు' సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.



