ప్లాస్టిక్‌కు చెక్.. ఉచితంగా స్టీల్ సామాన్లు!

TG : నిర్మల్ రూరల్ మండలం ముక్తాపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పంచాయతీ ఆధ్వర్యంలో 'స్టీల్ బ్యాంక్' ఏర్పాటు చేశారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కావాల్సిన స్టీల్ ప్లేట్లు, గ్లాసులను గ్రామస్తులు ఉచితంగా వాడుకోవచ్చని సర్పంచ్ మాన్పూరి రమేష్ తెలిపారు. గ్రామంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని అధికారుల సమక్షంలో గ్రామస్తులకు చెత్తబుట్టలు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఊరిలో జరిగే వేడుకల్లో ఇకపై ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయించారు.





