విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

చిత్తూరు జిల్లా ప్రజలు, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ వేళ ప్రజలందరికీ సంతోషం, శాంతి కలగాలని కోరారు.

