ఓటు హక్కు వినియోగించేందుకు ఏర్పాట్లు'

పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్, ఎన్నికల అధికారి డా. ప్రభాకర రెడ్డి ఆదేశాలమేరకు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. వికలాంగులు,వయోవృద్ధులు తమ ఓటు హక్కు సులబంగా వినియోగించుకునేలా మెట్ల స్థానంలో పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

