← Back to news

మైనార్టీ గురుకుల విద్యార్థులకు కంటి పరీక్షలు

By Surender· 54m ago· Mahabubnagar Rural, Mahabubnagar
మైనార్టీ గురుకుల విద్యార్థులకు కంటి పరీక్షలు

సమగ్ర కంటి చూపు పరీక్షలు ఫేజ్‌–3 కార్యక్రమంలో భాగంగా నాగసాల TGMRIES బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించారు. హాస్టల్‌లోని 346 మంది విద్యార్థులకు దగ్గర, దూరపు చూపు పరీక్షించగా 20 మందికి చూపు మందగించినట్లు గుర్తించారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున త్వరలో ఉచితంగా కంటి అద్దాలు అందించనున్నట్లు RBSK మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పారిజాత, PMO సునీత, స్టాఫ్‌ నర్స్‌ కృష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు.

More in Local