← Back to news

మీడియా ప్రధాన కార్యదర్శిగా నిజామోద్దీన్ ఎన్నిక

By Sunke Vinith· 1h ago
మీడియా ప్రధాన కార్యదర్శిగా నిజామోద్దీన్ ఎన్నిక

TG: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన MD నిజామోద్దీన్‌ను తాళ్లపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, సర్పంచులు కుర్సెంగ కళావతి, జైనేని రాజవ్వ, ఉపసర్పంచులు పుట్టపాక తిరుపతి, మర్సుకోల్ల ప్రభాకర్ తదితరులు శాలువాలతో సత్కరించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్సుకోల్ల లచ్చు పటేల్‌తో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నిజామోద్దీన్‌కు అభినందనలు తెలిపారు.

More in Local