← Back to news

హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు మిస్సింగ్

By DK· 20 Jul 2026· హైదరాబాద్
హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు మిస్సింగ్

TG: హైదరాబాద్‌లో ముగ్గురు బాలికలు ఆకస్మికంగా అదృశ్యమవడం కలకలం రేపుతోంది. దోమలగూడలో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబాలకు చెందిన స్నేహ, లలిత, లత ఆదివారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దోమలగూడ పోలీసులు CCTV ఫుటేజీని పరిశీలించగా, బాలికలు హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగినట్లు గుర్తించారు. వారు ఛత్తీస్‌గఢ్ వెళ్లారా లేదా ఇతర ప్రాంతానికి వెళ్లారా అనే కోణంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.

More in TG