VHP ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

AP: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో విశ్వహిందూ పరిషత్ స్థాపన దివస్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చిన్నారులతో భగవద్గీత శ్లోకాలు చెప్పించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు తెలిపారు. శ్లోకాలు చెప్పిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో VHP అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, ఆధ్యాత్మిక గురువు జయ రంగారెడ్డి, BJP నాయకులు వెంకప్ప, తదితరులు పాల్గొన్నారు.





