దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి: KVPS

TG: వికారాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న గ్రామపంచాయతీ ఖారోబార్, దళిత వర్గానికి చెందిన శ్రీనివాస్‌పై జరిగిన భౌతిక దాడిని KVPS తీవ్రంగా ఖండించింది. కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని KVPS బషీరాబాద్ మండల అధ్యక్షుడు కే. వెంకట్ డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.



