← Back to news

రూ.213.96 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం

By siva NEWS· 1h ago
రూ.213.96 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో రూ.213.96 కోట్ల నిధులతో చేపట్టనున్న సమగ్ర మంచినీటి అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేశారు. మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, TTD బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. UIDF, అమృత్ 2.0 నిధులతో మంచినీటి సరఫరా, వాటర్ పంపింగ్ వంటి పనులు చేపట్టనున్నారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

More in Local