← Back to news

వన్‌వే ఎఫెక్ట్‌తో నగరవాసులకు ‘Traffic’ కష్టాలు!

By Mahesh· 18 Aug 2026· హైదరాబాద్‌

TG: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నేటి నుంచి వన్‌వే అమలు. దీంతో ట్రాఫిక్‌తో వాహనదారులు, బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిన్ రోడ్లతో పాటు గల్లీ రోడ్లలోనూ రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఉద్యోగులు ఆఫీసులకు, ఇళ్లకు గంట లేట్‌గా చేరుతున్నారు. వన్‌వేలతో ప్రయాణ దూరం పెరగడంతో పాటు పెట్రోల్, డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏడాది, రెండేళ్లు కొనసాగుతుందని నగరవాసులు టెన్షన్‌లో ఉన్నారు.

More in Current Affairs