← Back to news

ఆలయ చోరీ.. నిందితుడికి 17 నెలల జైలు!

By Srikanth Goud· 1h ago· Jagitial, Jagitial, Jagitial
ఆలయ చోరీ.. నిందితుడికి 17 నెలల జైలు!

జగిత్యాల జిల్లాలో ఆలయ చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. 2025లో నల్లపోచమ్మ ఆలయం, దాస ఆంజనేయ స్వామి దేవాలయాల్లో బంగారు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆలయ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు ఫిర్యాదు అందింది. అప్పటి SI మన్మథరావు సిబ్బందితో కలిసి దర్యాప్తు చేసి నిందితుడు ఉబోధి శేఖర్ (22)ని అరెస్ట్ చేశారు. కేసును విచారించిన జగిత్యాల ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి శ్రీమతి రత్న పద్మావతి నిందితుడికి 17 నెలల 15 రోజుల జైలు శిక్ష విధించారు.

More in Local