జిల్లా కోర్టు ఏర్పాటుపై బార్ అసోసియేషన్ హర్షం
AP: మంగళగిరికి జిల్లా కోర్టు రావడం న్యాయవాదుల చిరకాల ఆకాంక్ష నెరవేరిన చారిత్రాత్మక ఘట్టమని మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు ఏర్పాటుతో న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రజలకు న్యాయం మరింత చేరువయ్యేందుకు ఈ నిర్ణయం కీలక ముందడుగని పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుభవార్తతో న్యాయవాదులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.



