← Back to news

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

By BK· 18h ago· నిర్మల్‌
ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

నిర్మల్‌లోని నాయిడివాడలో శ్రీ గుట్ట వీరన్న అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, ధర్మరక్షణకు ప్రతీక అని కొనియాడారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి, పాలనా దక్షత నేటి యూత్‌కి ఆదర్శమని అన్నారు. శివాజీ ఆశయాలను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని సంస్కృతిని కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

More in Local