← Back to news

పోలీసులపై రాళ్లతో దాడి.. ఉద్రిక్తత

By Adithya D· 21 Aug 2026

TG: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెద్దమ్మ తండాకు చెందిన బొగ్గుల సాయిగౌడ్ తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం నడిపింది మైనర్ అని, ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరు నమోదు చేయలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు బయలుదేరారు. అయితే తండా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

More in Local