యువకుడ్ని కాపాడిన పోలీసులు

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పల్లెలచెరువు-తెల్లగట్ల మధ్య ఉన్న సప్పె చెరువు వద్ద నీరు ఉధృతంగా ప్రవహించింది. వాగును దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వాహనదారుడు సునీల్ కుమార్ నీటిలో చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సంబశివరావు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక ఈతగాళ్ల సహాయంతో యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.



