← Back to news

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

By A VIJAY KUMAR· 59m ago· Khila Warangal, Khila Warangal, Warangal
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

TG: వరంగల్ జిల్లా ఖానాపురంలో అనారోగ్యానికి గురై చికిత్స పొందిన ఆరుగురు బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట ఏఎంసీ వైస్‌చైర్మన్, ఖానాపురం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కొరటాల వెంకటేశ్వర్లుకు రూ.26,500, చూడి ప్రతాపరెడ్డికి రూ.60 వేలు, సుమాలికి రూ.54 వేలు, కలఅమ్మకు రూ.95 వేలు, గొల్లపల్లి కుమారస్వామికి రూ.5,500, వి.వెంకటేశ్వర్లుకు రూ.24 వేలు మంజూరయ్యాయి.

More in Local