సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల ధర్నా

TG: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పీఆర్సీ అమలు, 6 డీఏల మంజూరు, సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.



