← Back to news

వైర్‌ పడిందన్న భయంతో పరుగులు.. ఆలయంలో విషాదం!

By Mahesh· 17 Aug 2026· Bihar
వైర్‌ పడిందన్న భయంతో పరుగులు.. ఆలయంలో విషాదం!

బిహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లా అశోక్‌ధామ్‌ ఆలయంలో ఈరోజు ఉదయం తీవ్ర విషాదం జరిగింది. శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో భారీగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 6.45 గం. సమయంలో ఎలక్ట్రిక్ వైర్‌ పడిందన్న భయంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాట ఘటనకు ఖచ్చితమైన కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.