ప్రజ్వల్ రేవణ్ణ బ్యారక్‌లో ఫోన్.. జైలు ఆఫీసర్ సస్పెండ్
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మాజీ MP ప్రజ్వల్ రేవణ్ణ బ్యారక్‌లో బ్యాన్ చేసిన వస్తువులు ఉండడం కలకలం రేపింది. CCB అధికారులు చేసిన సడన్ చెకింగ్‌లో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్, ఛార్జర్ స్వాధీనం చేసుకున్నారు. రేవణ్ణ మరో ఖైదీ ప్రతాప్ రాయ్‌తో కలిసి ఉన్న బ్యారక్‌లో మంచం కింద ఫోన్ దొరికినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెక్యూరిటీ లోపంపై జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయగా, సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు.



