కేసీఆర్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ

సిద్ధిపేట జిల్లా.. గజ్వేల్‌లో టెన్షన్ వాతావరణం ఉంది. ఎర్రవల్లి లోని BRS అధినేత కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఇవాళ కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎస్సీ నాయకులు పిలుపు ఇచ్చారు. స్పీకర్‌పై BRS ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. కాంగ్రెస్ నేతలు ఈ పిలుపు ఇచ్చారు. అందువల్ల పోలీసులు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



