మహిళ కిడ్నీ మాయం..!

గర్భసంచి క్యాన్సర్ చికిత్సకు చేరిన 60 ఏళ్ల తాళ్లపల్లి కమలమ్మకు ఆపరేషన్‌లో కిడ్నీ తొలగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా.. ఆలేరులో ఇది జరిగింది. యాదగిరిపల్లికి చెందిన ఆమెకు.. అర్పిత నర్సింగ్‌హోంలో డాక్టర్ ప్రభాకర్, హైదరాబాద్ అంకాలజిస్ట్‌తో కలిసి ఆపరేషన్ చేశారు. తర్వాత కడుపు నొప్పి వచ్చింది. స్కాన్ చేస్తే, ఒకే కిడ్నీ ఉన్నట్లు తెలిసింది. కొవ్వు, క్యాన్సర్ గడ్డలు తీసే సమయంలో కిడ్నీ తీసేయాల్సి వచ్చిందని డాక్టర్లు తెలిపారు. కమలమ్మ కొడుకు కంప్లైంట్ చెయ్యడంతో కేసు నమోదైంది.



