← Back to news

నీట మునిగిన వందల ఎకరాల పంటలు

By Mohan· 1d ago· Rajam, Rajam, Vizianagaram

విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడ వద్ద అరసాడ వాగు పొంగిపొర్లడంతో వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పొలాల్లోకి చేరడంతో వరి, చెరుకు, మినుము పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సుమారు రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పంటలు నీటిపాలయ్యాయని తెలిపారు. అధికారులు వెంటనే పంటపొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని, ప్రభుత్వం నుంచి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

More in AP