నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి: జక్కా అశోక్

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో నాగులేరుకు వెంటనే నీటిని విడుదల చేయాలని వైసీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు జక్కా అశోక్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ... దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. మరో 10–15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటి సమస్య మరింత తీవ్రతరం అవుతుందని అన్నారు.



