స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి

AP: స్మార్ట్ కిచెన్ విధానంతో తమ ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆరోపిస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గుంటూరులో ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మండలానికి రూ.30–40 లక్షలు ఖర్చు చేసి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.





