← Back to news

కోటియాలో AP ఎన్నికలా? BJPకి నవీన్ పట్నాయక్ ప్రశ్నలు!

By Mahesh· 1h ago· X· Odisha
కోటియాలో AP ఎన్నికలా? BJPకి నవీన్ పట్నాయక్ ప్రశ్నలు!

ఒడిశా మాజీ CM నవీన్ పట్నాయక్ కోటియా వివాదంపై BJPను <a href="https://x.com/Naveen_Odisha/status/2112163975408537977">ప్రశ్నించారు.</a> ఒడిశాలో భాగమైన కోటియాలో AP ఎన్నికలు ప్రకటించడం ఆందోళనకరమన్నారు. గతంలో ‘ఆంధ్రా గో బ్యాక్’ అంటూ స్లోగన్స్ ఇచ్చిన BJP.. ఇప్పుడు ఏం చేస్తోందని నిలదీశారు. 2024 ఎన్నికల్లో కోటియా సమస్యకు పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. NDAలో TDP ఉండటంతో ఒడిశా ప్రభుత్వం మౌనంగా ఉంటోందా అని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమగ్రతను కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోటియాలో AP ఎన్నికలా? BJPకి నవీన్ పట్నాయక్ ప్రశ్నలు!
కోటియాలో AP ఎన్నికలా? BJPకి నవీన్ పట్నాయక్ ప్రశ్నలు!

More in AP