← Back to news

రూ.20 లక్షలు.. డ్రైనేజీ పనులు మాత్రం జీరో!

By Srikanth· 2d ago

జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. కానీ పనులు మాత్రం ఇంకా మొదలు కాలేదు! కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారుల కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఓ ఇంటి యజమాని తన ఇంటి ముందు సొంత డబ్బులతో డ్రైనేజీ పనులు చేయించుకుంటున్నారు. ’’డబ్బు మంజూరైనా పనులు ఎందుకు చేస్తలేరు. ఎందుకింత నిర్లక్ష్యం? నేను టాక్సు కట్టను. అప్పుడు నన్ను ఏమీ అనరు కదా’’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? వీడియో తీయండి. పంపండి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.