జూరాల ప్రాజెక్టు గేట్లు ఓపెన్.. శ్రీశైలానికి వరద
TG: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. అధికారులు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 30,700 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. భీమా నది నుంచి వరద చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.



